Vizianagaram: విజయనగరం జిల్లాలోని జొన్నాడ టోల్ గేట్ వద్ద నిర్వాహకులు రాడ్లతో హల్ చల్ చేశారు. ఓ వాహనదారుడుని రాడ్లతో చితకబాదిన టోల్ గేట్ సిబ్బంది.. విశాఖ పట్నం నుంచి కారులో వస్తూ టోల్ గేట్ ద్విచక్ర వాహనాలు వెళ్లాల్సిన మార్గంలో వెళ్లిన డ్రైవర్.. ఫాస్ట్ ట్రాక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా లేవా అని తెలుసుకునేందుకు కారును ఆపిన సదరు కారు డ్రైవర్.. ఎందుకు ద్విచక్ర వాహానాలు వెళ్లే దారిలో వెళ్లారంటూ కార్ డ్రైవర్ తో గొడవకు దిగిన టోల్ ప్లాజా నిర్వాహకులు.. డ్రైవర్ తో పాటూ కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురిపై రాడ్లతో దాడికి దిగిన టోల్ గేట్ సిబ్బంది.
Read Also: Indrakeeladri: దుర్గమ్మకు కుటుంబ సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించనున్న విజయవాడ సీపీ
కాగా, ఈ దాడిలో కారు డ్రైవర్ తలపై తీవ్ర గాయం కావడంతో పాటు మరో ముగ్గురు ప్రయాణికులకు సైతం గాయాలు అయ్యాయి. ఈ ఘటనతో భయాందోళనతో పరుగులు తీసిన కార్ డ్రైవర్, ప్రయాణికులు.. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో రంగంలోకి దిగిన సోలీసుల ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. టోల్ గేట్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.