అఖండ సినిమా అఖండ విజయం సాధించిన సందర్భంగా విశాఖలో విజయోత్సవ సభ నిర్వహించారు. ముందుగా స్వామివారిని దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెలియచేసుకునేందుకు వచ్చామన్నారు హీరో బాలయ్యబాబు. ఏడాది తొమ్మిది నెలల తర్వాత విడుదలైన సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఘన విజయం అందించారు. ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు చెప్పారు హీరో బాలకృష్ణ. ఇది మా విజయం మాత్రమే కాదు….చిత్ర పరిశ్రమ విజయం అన్నారు బాలకృష్ణ. ఈ సినిమాతో చలనచిత్ర పరిశ్రమకు ఒక ధైర్యం వచ్చింది. మంచి సినిమాలను ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారని రుజువైంది. సినిమాను ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు బాలకృష్ణ.