Sena Tho Senani: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. నేడు విశాఖపట్నం వెళ్లనున్నారు.. గత ఎన్నికల్లో కూటమి విజయంలో కీలక భూమిక పోషించింది జనసేన.. ఆ తర్వాత కీలకమైన డిప్యూటీ సీఎం పదవి కూడా జనసేనాని వరించింది.. ఓ వైపు కూటమి సర్కార్‌లో కీలక శాఖలు నిర్వహిస్తూనే.. మరోవైపు పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు పవన్ కల్యాణ్.. దీనికోసం విశాఖ వేదికగా మూడు రోజుల పాటు జనసేన విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించబోతున్నారు.. రేపు, ఎల్లుండి పార్టీ లెజిస్లేచర్ మీటింగ్… వివిధ రంగాల ప్రముఖులతో సమావేశాలు ఉండనున్నాయి.. ఇక, ఈనెల 30న సేనతో సేనాని బహిరంగ సభ ఉంటుంది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 15 వేల మంది ఆహ్వానితులు తరలిరానున్నారు.. పార్టీ సంస్థాగత అంశాలు, కూటమి ప్రభుత్వంలో జనసేన భాగస్వామ్యం, భవిష్యత్ ప్రణాళిక, స్థానిక ఎన్నికల సన్నద్ధత అజెండాగా ఈ కీలక సమావేశాలు జరగబోతున్నాయి..
Read Also: Ganesh Chaturthi 2025: వినాయకుడి విగ్రహం పెడుతున్నారా? ఇది మీ కోసమే..
విశాఖ మున్సిపల్ స్టేడియంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.. రేపు అనగా ఈ నెల 28న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ ఉండగా.. ఎల్లుండి పార్లమెంటు నియోజకవర్గాలవారీగా ఆది నుంచీ పార్టీ కోసం కష్టపడి, వైసీపీపై పోరాటం చేసిన కార్యకర్తలు, ఆహ్వానితులతో సమావేశం నిర్వహించబోతున్నారు.. ఇక, చివరి రోజు.. అంటే ఈ నెల 30న పార్టీ రాష్ట్రస్థాయి క్రియాశీల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఉండగా.. మధ్యాహ్నం ఒంటి గంటకు బహిరంగ సభ ప్రారంభంకానుంది.. సాయంత్రం ఆరు గంటలకు పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు.. ఈ సమావేశాల్లో మహిళల బాధ్యత, అందరికీ రక్షిత నీరు, ఉపాధి కల్పన తదితర అంశాలతోపాటు కూటమి ప్రభుత్వ ఏడాది సుపరిపాలనపై చర్చించనున్నట్టుగా ఇప్పటికే పార్టీ నేతలు ప్రకటించారు.. జనసేన నేతలు, కార్యకర్తలు.. కూటమిలో మిగిలిన 2 పార్టీల నేతలతో కలిసి ఏ విధంగా పనిచేయాలి… సోషల్ మీడియా వేదికగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారాలను ఎలా తిప్పికొట్టాలి తదితర అంశాలపై చర్చ సాగనుంది..