YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది.. ఓవైపు సీబీఐ విచారణ కొనసాగుతుండగానే.. మరోవైపు కోర్టులో కూడా విచారణ సాగుతోంది.. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.. ఈ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారామె.. అయితే, ఈ కేసు రేపు విచారించనుంది సుప్రీంకోర్టు..
Read Also: Hyderabadis Ott Mentality: హైదరాబాద్‌లోని ఓటీటీ సబ్‌స్క్రైబర్లకు సంబంధించిన ఆసక్తికర అంశాలు
కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు సునీత.. ఈ రోజు సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు సునీత పిటీషన్ ను ప్రస్తావించారు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూద్రా.. విచారణకు స్వీకరించేందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు.. రేపు విచారణకు స్వీకరిస్తామని చెప్పింది.. దీంతో, రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.. కాగా, వైఎస్ వివేకా హత్య కేసులో మధ్యంతర బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట లభించింది.. ఈ నెల 25వ తేదీ వరకూ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మధ్యంతర తీర్పు వెలువరించింది.. 25వ తేదీన తుది తీర్పు ఇవ్వనున్నట్లు వెల్లడించింది తెలంగాణ హైకోర్టు.. దీంతో, తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేశారు వైఎస్ వివేకా కూతురు సునీత.