ఏపీలో అధికార విపక్షాల మధ్య విమర్శలు కొనసాగుతూనే వున్నాయి. మా మంత్రి చనిపోయిన షాక్ లో మేముంటే ఆయనపై కూడా నీచంగా మాట్లాడుతున్నారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడటం దుర్మార్గం అన్నారు చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. రాష్ట్రంలో ఒక ప్రజా పరిపాలన కొనసాగుతుంటే దాన్ని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారు. కరకట్ట పై అక్రమంగా నివాసం ఉంటూ దాన్ని కుట్ర కోటగా మార్చాడు. అత్యున్నత సంస్థ దర్యాప్తు కొనసాగుతోంది…దాన్ని మేము కూడా ఆహ్వానించాం. కానీ దర్యాప్తులో…
మాజీ మంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఢిల్లీ పెద్దలదే అన్నారు టీడీపీ నేత బోండా ఉమా. గతంలో జయలలిత కేసు కర్ణాటకలో విచారణ జరిగినట్లు వివేకా హత్య కేసు విచారణ వేరే రాష్ట్రంలో చేపట్టాలి. వివేకా హత్య కేసు నిందితుల్ని కాపాడేందుకు వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థల్ని సైతం నాశనం చేసే తీరు చూసి దేశం మొత్తం నివ్వెరపోతోంది. బాబాయ్ హత్యకేసు వెలికితీస్తున్న సీబీఐ అధికారులపై పోలీసులతో కేసు…
ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసులో వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వివేకాను ఓ ల్యాండ్ సెటిల్ మెంట్ లో హత్య చేసినట్లు సీబీఐ ముందు దస్తగిరి వాగ్మూలం ఇచ్చాడు. అయితే ఈ కేసులో కేసులో దస్తగిరికి క్షమాభిక్ష ఇస్తున్నట్లు సీబీఐ పేర్కొంది. దీంతో సీబీఐకు ఆ అధికారం లేదంటూ గంగిరెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. దీంతో…
ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద హత్యకేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి వివేకా హత్య కేసుతో నాకు సంబంధం లేదంటూ అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పను ఆశ్రయించాడు. రూ.10 కోట్లు సుపారీ తీసుకొని అవినాష్‌రెడ్డి, శంకర్‌రెడ్డిలు నాతో వివేకా హత్య చేయినట్లు చెప్పాలంటూ వివేకా కుమార్తె సునీత, సీబీఐ, మడకశిర ఎస్సై, సీఐ శ్రీరామ్ లు నన్ను వేధిస్తున్నారని గంగాధర్ రెడ్డి ఎస్పీకి వెల్లడించారు. అంతేకాకుండా నాకు, నా…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి అరెస్టైన విషయం తెలిసిందే. అనంతరం ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా వివేకానంద డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో ఎర్ర గంగిరెడ్డి పేరు మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ పిటిషన్ పై విచారణ చేసిన కడప కోర్టు.. బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకంగా మారిన డ్రైవర్ దస్తగిరి కొన్ని రోజుల క్రితం అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వివేకాను ఎలా.. ఎవరు హత్య చేశారో కూడా వాగ్మూలం ఇచ్చాడు. వివేకా హత్య వెనుక అవినాష్ రెడ్డి ఉన్నాడంటూ దస్తగిరి వాగ్మూలమిచ్చినట్లు తెలియడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన…
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తుల్ని పదునైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు సీబీఐ అధికారులు. ఈ క్రమంలో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏలు రాఘవరెడ్డి, రమణారెడ్డిలతో పాటు హోంగార్డు నాగభూషణం, వేంపల్లికి చెందిన రహంతుల్లా, బండి కేశవ, మల్లీ అనే వ్యక్తులను విచారించారు. పులివెందుల ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో 8 మంది అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని తొలుత స్థానిక పోలీసులకు ఎలా…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీమంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పురోగతి సాధించింది.. ఈ కేసులో సుదీర్ఘ విచారణ కొనసాగిస్తున్న సీబీఐ.. వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మెన్ రంగయ్య నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది.. రంగయ్య తన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు.. వివేకా హత్యకు రూ. 8 కోట్లు సుపారీ ఇచ్చినట్లు తెలిపిన ఆయన.. ఈ హత్యలో తొమ్మిది మంది భాగంగా ఉన్నారని తెలిపారు. హత్య…
వైయస్ వివేకా హత్య కేసులో 14వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతుంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో విచారణ జరుగుతుంది. వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి వరుసగా నాలుగో రోజు విచారణకు హాజరయ్యాడు. అయితే ఎర్ర గంగిరెడ్డితో పాటు రాఘవేంద్ర రెడ్డి, సింహాద్రిపురం నుంచి వ్యవసాయ కూలీ ఓబుల్ పతి నాయుడు, కదిరికి చెందిన కిషోర్ కుమార్ రెడ్డి, పులివెందులకు చెందిన దంపతులు కృష్ణా, సావిత్రి తో కలిపి నేడు మొత్తం ఆరు మంది…