కొన్నేళ్లుగా ఏవోబీ బార్డర్లో గంజాయి సాగు విస్తృతంగా సాగుతుంది. దీంతో ప్రభుత్వం దీనిపై ఉక్కుపాదం మోపుతుంది. విశాఖ ఏజెన్సీలో గంజాయి పంట సాగు చేస్తున్న గిరిజనులు మీడియాతో మాట్లాడారు. మేం ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం లేదు. గంజాయి మొక్కలు సాగు నేరమే అయినా ఎన్నో కష్టాలతో మేం ముందుకు వచ్చాం. ప్రభుత్వం ముందే చెబితే మేం గంజాయి వేసే వాళ్లం కాదు కదా అంటున్న గిరిజ నులు. మా ఆర్థిక స్థితిగతుల ప్రకారమే మేం గంజాయి వేస్తున్నామని గిరిజనులు…
విశాఖపట్నం జిల్లా యలమంచిలిలో నాగుల చవితి సందర్భంగా నిర్వహించిన నేల వేషాల కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. సంతోష్ అనే వ్యక్తి నోట్లో డీజిల్ పోసుకుని విన్యాసాలు చేస్తుండగా.. మంటలు అంటుకుని అతడి ముఖానికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో అక్కడే ఉన్న స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా.. అప్పటికే సంతోష్ చేతిలోని సీసాలో ఉన్న డీజిల్ పడి మంటలు మరింత తీవ్రమయ్యాయి. Read Also: బట్టల షాపులోకి దూసుకెళ్లిన పల్సర్ బైక్.. ఎగిరిపడ్డ యువకుడు ఈ ఘటనలో…
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యతిరేక పోరాటానికి నేరుగా మద్దతు ప్రకటించనున్నారు పవన్. ఇవాళ మధ్యాహ్నం విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద దీక్ష చేస్తున్న కార్మికులు, నిర్వాసితుల శిబిరాలను జనసేనాని సందర్శిస్తారు. అనంతరం స్టీల్ ప్లాంట్ ప్రధాన రహదారిపై ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో పవన్ పాల్గొని పార్టీ విధానం వెల్లడిస్తారు. ఇక…ఇప్పటికే జనసేన తన సంపూర్ణ మద్దతును ప్రయివేటీకరణ వ్యతిరేక పోరాటానికి ప్రకటించింది. ఐతే…నేరుగా పవన్ కళ్యాణ్ రావడం…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విశాఖ పర్యటన ఖరారైంది… జనసేనాని పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది ఆ పార్టీ.. ఉక్కు పరిరక్షణ పోరాట ఉద్యమానికి సంఘీభావం తెలపనున్న పవన్ కల్యాణ్.. ఈనెల 31 మధ్యాహ్నం ఉక్కు పరిరక్షణ సభలో పాల్గొంటారని వెల్లడించింది.. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వడివడిగా అడుగులు వేస్తుండగా… విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ సాధించుకున్న స్టీల్ ప్లాంట్‌ను వదులుకోవడానికి సిద్ధంగాలేని కార్మిక, ప్రజాసంఘాలు ఆందోళన చేస్తూ వస్తున్నాయి.. వారికి…
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే కేంద్రం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు ప్రతిపాదనలు తీసుకొచ్చిందో అప్పటి నుంచే కార్మికులు, ఉద్యోగులు నిరసనబాట పట్టారు. వివిధ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు కార్మికుల నిరసనలకు మద్దతు ఇస్తున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం నేటికి 250 రోజులు పూర్తయింది. దీంతో ఈరోజు 250 మందితో25…
విశాఖపట్నంలో మైనర్ బాలిక మృతి కేసులో సంచలనంగా మారింది.. అయితే, అగనంపూడి సమీపంలో శనివాడలో ఆదిత్య అపార్ట్మెంట్ వాచ్మెన్ కుమార్తె పావని డెత్ కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. రాత్రివేళ తల్లిదండ్రులు తనను ఒంటరిగా అబ్బాయితో చూస్తారన్న భయంతో బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బాలిక తండ్రి వాచ్‌మెన్‌గా పని చేస్తున్న పక్క అపార్ట్మెంట్ 101లో ఉంటున్న యువకుడు నగేష్‌ను కలిసేందుకు బాలిక వెళ్లిందని.. ఇద్దరూ కలిసి మేడపైకి…
ఏపీలో అక్రమ మద్యం గుట్టు రట్టయ్యింది. ఢిల్లీ నుండి విశాఖకు భారీగా మద్యం బాటిళ్ళు తెచ్చి అమ్ముతున్నాడు సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చింతల గౌరీ శంకర్. విశాఖ నుండి విమానంలో ఢిల్లికి వెళ్లి అక్కడ నుండి మద్యంతో తిరిగి రైళ్ళులో చేస్తాడు. సిఐఎస్ఎఫ్ చెందిన ట్రంక్ పెట్టిలో మద్యం రవాణ చేస్తున్నాడు. ఢిల్లీ నుండి ఇక్కడికి మద్యం తెచ్చి అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో అరెస్టు చేసారు ఎక్సైజ్ పోలీసులు. న్యూ ఢిల్లీ వెళ్లి రమేష్ అనే వ్యక్తి దగ్గర…
ఆంధ్రప్రదేశ్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై వివాదం నడుస్తూనే ఉంది.. ఈ విషయంలో ఏపీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు, హిందూ సంఘాలు.. వైఎస్ వర్ధంతికి, స్కూళ్లకు, బార్లకు లేని కరోనా.. వినాయక ఉత్సవాలు నిర్వహిస్తేనే వస్తుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు.. ఇక, వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలంటూ విశాఖలో మౌనదీక్ష చేపట్టారు.. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశ్వ హిందూ సాదు పరిషత్ ఆధ్వర్యంలో మౌన దీక్షకు కూర్చుకున్నారు.. వినాయకుడి విగ్రహానికి నల్ల రిబ్బన్ కట్టి..…
చాలా కాలం వేచి చూసిన తర్వాత వారికి అధికార యోగం పట్టింది. పాలకవర్గంలోకి ఇలా వచ్చారో లేదో పెత్తనం చేయడం మొదలు పెట్టారు. విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఆ ప్రజాప్రతినిధుల దూకుడుకు కళ్లెం వేయడం అధికారులకు సవాల్‌గా మారిందట. వారెవరో ఏంటో లెట్స్ వాచ్! కొందరు కార్పొరేటర్లు సర్వ అధికారాలు ఉన్నాయని ఫీలవుతున్నారా? పదేళ్లకుపైగా ప్రత్యేక అధికారి పాలనలో సాగిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో 98 డివిజన్లకు ఇటీవలే ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గం కొలువు తీరింది.…
ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీ కేసులు వెయ్యికిపైగా నమోదవుతున్నాయి. ఏపీలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఉత్తరాంధ్రలో కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పోలిస్తే, విశాఖలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా వీకెండ్స్‌లో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆంక్షలపై సడలింపులు ఇచ్చిన తరువాత విశాఖ బీచ్‌కు తాకిడి పెరిగింది. శని, ఆదివారాల్లో పెద్దసంఖ్యలో బీచ్‌కు పర్యాటకులు తరలి వస్తున్నారు. ఒక్క విశాఖ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విశాఖ బీచ్‌కు పర్యాటకులు తరలి వస్తుండటంతో…