చాలా కాలం వేచి చూసిన తర్వాత వారికి అధికార యోగం పట్టింది. పాలకవర్గంలోకి ఇలా వచ్చారో లేదో పెత్తనం చేయడం మొదలు పెట్టారు. విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఆ ప్రజాప్రతినిధుల దూకుడుకు కళ్లెం వేయడం అధికారులకు సవాల్‌గా మారిందట. వారెవరో ఏంటో లెట్స్ వాచ్! కొందరు కార్పొరేటర్లు సర్వ అధికారాలు ఉన్నాయని ఫీలవుతున్నారా? పదేళ్లకుపైగా ప్రత్యేక అధికారి పాలనలో సాగిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో 98 డివిజన్లకు ఇటీవలే ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గం కొలువు తీరింది.…
ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీ కేసులు వెయ్యికిపైగా నమోదవుతున్నాయి. ఏపీలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఉత్తరాంధ్రలో కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పోలిస్తే, విశాఖలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా వీకెండ్స్‌లో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆంక్షలపై సడలింపులు ఇచ్చిన తరువాత విశాఖ బీచ్‌కు తాకిడి పెరిగింది. శని, ఆదివారాల్లో పెద్దసంఖ్యలో బీచ్‌కు పర్యాటకులు తరలి వస్తున్నారు. ఒక్క విశాఖ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విశాఖ బీచ్‌కు పర్యాటకులు తరలి వస్తుండటంతో…
పర్యావరణంలో రోజురోజుకు అనేక మార్పులు వస్తున్నాయి. భూమిపై వేడి పెరిగిపోతున్నది. వాతావరణంలో వేడి పెరగడం వలన ధృవప్రాంతాల్లో మంచు విపరీతంగా కరిగిపోతున్నది. ఎప్పుడూ లేని విధంగా అర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లోని మంచు భారీస్థాయిలో కరుగుతున్నది. వేడికి గ్లేసియర్లు కరిగి సముద్రంలో కలిసిపోవడంతో నీటిమట్టం భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై నాసా శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు. వీరి పరిశోధనల్లో అనేక విషయాలు వెలుగుచూశాయి. నసా పరిశోధనల ప్రకారం 2100 నాటికి ఇండియాలోని 12…
కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనతో విశాఖ ఎయిర్ పోర్ట్ దగ్గర హై అలెర్ట్ కొనదగుతుంది. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకారణకు వ్యతిరేకంగా ఆర్ధిక మంత్రికి వినతులు సమర్పించాలని జెఏసీ నిర్ణయం తీసుకుంది. వందల సంఖ్యలో ఎయిర్ పోర్ట్ దగ్గరకు కార్మికులు వస్తారని ముందస్తు సమాచారం రావడంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. ఇక అక్కడికి వచ్చిన స్టీల్ ప్లాంట్ కార్మికులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ముందస్తు అనుమతి లేకపోవడంతో ఎయిర్ పోర్ట్ ఎంట్రన్స్ దగ్గరే అడ్డగిస్తున్నారు. విశాఖ…
గట్టిగా ఉన్నామని అనుకున్నచోట టీడీపీ నేతల లెక్కలు వర్కవుట్ కావడం లేదా? అంతా ఆరంభ శూరత్వమేనా? బలహీనతలు తెలిసీ నేల విడిచి సాము చేస్తున్నారా? కేడర్ వద్దని వారించినా పంతాలకు పోయి.. ఎందుకు పరాజయాలను మూట కట్టుకుంటున్నారు? అది ఎక్కడో.. ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. విశాఖలో కీలక అంశాల్లో టీడీపీ అభాసుపాలు! రాజకీయ చైతన్యానికి విశాఖ వేదిక. ఇక్కడ టీడీపీ కూడా గట్టిగానే ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సిటీలోని నాలుగు ఎమ్మెల్యేల స్థానాల్లో టీడీపీ…
మైనింగ్ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సహజ వనరుల దోపిడీపై ఫిర్యాదు రావడంతో… విశాఖలో క్వారీలపై తనిఖీల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. డ్రోన్లు, జీపీఎస్ ఆధారిత సర్వే ద్వారా అక్రమాల గుర్తించి.. ఇష్టారాజ్యంగా జరుగుతున్న గనుల తవ్వకాలకు చెక్ పెట్టనున్నారు. అనకాపల్లిలోని ఓ మైనింగ్ కంపెనీ కార్యకలాపాలపై విచారణ జరపనుంది సీఐడీ. గనులశాఖ విజిలెన్స్ కూడా ఇప్పటికే భారీగా జరిమానాలు విధించింది. విశాఖలోని వందల క్వారీలు.. కనీస నిబంధనలు కూడా పాటించడం లేదని నిర్ధారించారు.…
విశాఖలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటానికి ఇప్పటికే వివిధ పార్టీలు మద్దతు తెలిపాయి. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయాలని కార్మికులు నిర్ణయం తీసుకున్నారు. స్టీల్‌ప్లాంట్ కోసం పార్లమెంట్లో పోరాడాలని ఇవాళ ఎంపీలను కలిసి విజ్ఞప్తి చేయబోతున్నారు. ఇక, కార్మిక సంఘాలు చేస్తున్న నిరసనలకు, ఆందోళనలకు సీపీఐ మద్దతు తెలిపింది. ఇతర రాజకీయ పార్టీల మద్దతు కూడా కోరాలని కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయం తీసుకుంది. స్టీల్ ప్లాంట్…