Nara Lokesh: కబ్జాల నుండి విశాఖని రక్షించుకుందాం.. మీకు అండగా ఉంటాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నంలో భూకబ్జాలపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. విశాఖని రాబంధుల్లా పీక్కుతింటున్నారు వైసీపీ కబ్జాకోరులు అంటూ ఫైర్ అయ్యారు.. కన్నుపడిన ప్రతి గజాన్ని కబ్జా చేస్తూ విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేస్తున్నారని విమర్శించిన ఆయన.. ఏకంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎస్పీకి చెందిన స్థలాన్నే వైసీపీ ఎంపీ ఆక్రమించడం వైసీపీ కబ్జాపర్వంలో సరికొత్త కోణం అన్నారు. స్థలం కబ్జా చేయడమే కాకుండా రివర్సులో ఎంపీ మనుషులు ఎస్పీకే వార్నింగ్ ఇవ్వడం విశాఖలో వైసీపీ ల్యాండ్ మాఫియా అరాచకాలకు అద్దం పడుతుందన్నారు.
Read Also: AP: సర్కార్ నిర్లక్ష్యంతో కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యామ్.. హైకోర్టులో పిల్..
Also Read
- MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
- AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
- AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
- CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
ఇక, ప్రజల్ని కాపాడే పోలీసులకే ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు నారా లోకేష్.. విశాఖపట్నంలో వైసీపీ కబ్జాల పర్వానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చిన ఆయన.. బాధితులంతా బయటకు రండి.. వైసీపీ కబ్జా కోరల నుండి విశాఖని రక్షించుకుందాం.. మీకు అండగా టీడీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. మరోవైపు.. సీఎం వైఎస్ జగన్‌పై హాట్ కామెంట్లు చేశారు లోకేష్.. సీఎం వైఎస్ జగన్ మాటలు కోటలు దాటుతాయి.. కానీ, చేతలు తాడేపల్లి ప్యాలెస్ కాంపౌండ్ కూడా దాటవని ఎద్దేవా చేశారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు కనీసం రూ.20 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన జగన్.. ఇప్పుడు బాకరపేట బస్సు ప్రమాద ఘటనలో రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మేం కొత్త డిమాండ్లు ఏమి పెట్టడం లేదు.. ఆనాడు తాను అన్నట్టుగానే బాకరాపేట ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షలివ్వాలని డిమాండ్ చేశారు నారా లోకేష్.
తాజావార్తలు
-
IND W vs ZIM W 1st T20: బౌలర్ల దెబ్బకు వణికిన జింబాబ్వే.. భారత్ టార్గెట్ 115
-
Vijay Deverakonda: ‘కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం’
-
BMW F 450 RR Unveiled: 177 kmph టాప్ స్పీడ్.. 48HP పవర్‌తో BMW F 450 RR కొత్త స్పోర్ట్స్ బైక్!
-
MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
-
Telangana Bars : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా..
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!