ఒక్కగానొక్కడ కొడుకు.. ఘనంగా పెళ్ళి నిర్వహించాలని బంధుమిత్రులందరినీ తల్లిదండ్రులు ఆహ్వానించారు.. అందరూ విచ్చేయడంతో పండగ వాతావరణం నెలకొంది.. రాత్రంతా అందరూ సంతోషంగా గడిపారు.. ఉదయమే లేచి ఇతర పనులన్నీ సిద్ధం చేసుకోవాలని అనుకొని పడుకున్నారు.. తీరా ఉదయం లేచి చూస్తే.. పెళ్ళి కొడుకు చేసిన పనికి విషాదఛాయలు అలుముకున్నాయి. వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అందరూ నిద్రించిన తర్వాత, తన గదిలోకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విశాఖలోని మల్కాపురం జయేంద్రకాలనీలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..…
బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ తీవ్రరూపం దాల్చి తీరం వైపు దూసుకొస్తుంది.. ఇప్పటికే తీరం వెంబడి ఉన్న జిల్లాల అధికారులు అప్రమత్తం అయ్యారు.. మరోవైపు అసని తుఫాన్తో అలెర్ట్ అయ్యింది తూర్పు నావికాదళం.. ఆంధ్రప్రదేశ్, ఒడిషా ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి తీవ్ర తుఫాన్ గమనాన్ని నిశితంగా పరిశీలిస్తోంది నావికాదళం… విపత్కర పరిస్థితుల్లో సహాయ, వైద్య సేవలు అందించేందుకు యుద్ధనౌకలు, హెలీకాఫ్టర్లును అందుబాటులో ఉంచింది నేవీ.. విశాఖలోని ఐ.ఎన్.ఎస్ డేగా… చెన్నైలోని ఐ.ఎన్.ఎస్ రాజాలీ నుంచి ఏరియల్ సర్వే,…
MVV సత్యనారాయణ. విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు. ఎంపీ అయిన మొదట్లో యాక్టివ్ పాలిటిక్స్లో చురుకైన పాత్ర పోషించేందుకు ప్రయత్నించారు ఎంవీవీ. వ్యాపార అనుభవం ఉన్నప్పటికీ… రాజకీయ ఎత్తుగడలను తట్టుకుని నిలబడలేకపోయారు. ఇటీవల కాలంలో ఎంవీవీని ఊహించని వివాదాలు చుట్టుకుంటున్నాయి. వ్యాపారం, రాజకీయం వేరువేరు కాదని.. ఒకదాని ప్రభావం మరోదానిపై ఖచ్చితంగా పడుతుందనే వాస్తవం బాగా తెలిసొచ్చిందట. దీనికి కారణం ఆయన చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదులే. కొద్దినెలల క్రితం ఎంపీ MVV పేరు…
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్.. పార్టీ శ్రేణులను బిజీ చేయడమే కాదు.. తాను బిజీగా గడుపుతున్నారు.. అన్ని జిల్లాలను చుట్టేస్తున్నారు.. ఇక, గురువారం రోజు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటన కొనసాగనుంది.. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి… సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో ఆయన చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. Read Also: KCR: టీఆర్ఎస్ సుసంపన్న పార్టీ.. ఒక్క పిలుపిస్తే రూ.600 కోట్లు..! రేపు ఉదయం…
విశాఖపట్నంలో భూకబ్జాలపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. విశాఖని రాబంధుల్లా పీక్కుతింటున్నారు వైసీపీ కబ్జాకోరులు అంటూ ఫైర్ అయ్యారు.. కన్నుపడిన ప్రతి గజాన్ని కబ్జా చేస్తూ విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేస్తున్నారని విమర్శించిన ఆయన.. ఏకంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎస్పీకి చెందిన స్థలాన్నే వైసీపీ ఎంపీ ఆక్రమించడం వైసీపీ కబ్జాపర్వంలో సరికొత్త కోణం అన్నారు. స్థలం కబ్జా చేయడమే కాకుండా రివర్సులో ఎంపీ మనుషులు ఎస్పీకే వార్నింగ్ ఇవ్వడం విశాఖలో…
వారిద్దరు ఒకేలా వుండే అక్కాచెల్లెళ్ళు. ప్రియా, ప్రియాంక అనే ఈ ట్విన్స్ ఇప్పుడు యూట్యూబ్ లో సెన్సేషన్. 2003 నవంబర్ 4 th న జన్మించిన వీరిద్దరూ ఇప్పుడు వైరల్ అవుతున్నారు. వీళ్ళ నాన్నది వైజాగ్, అమ్మది వెస్ట్ బెంగాల్. లవ్ మ్యారేజ్. ప్రస్తుతం గాజువాక లో ఉంటున్నారు, నాన్న స్టీల్ ప్లాంట్ లో ఎంప్లాయ్, అమ్మ హౌస్ వైఫ్. వీరికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. బీవీకే కాలేజ్ లో ప్రియా ప్రియాంక బీకాం ఫైనల్…
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు తల పెట్టిన సమ్మె వాయిదా వేశారు.. వేతన ఒప్పందం అమలు కోసం ఈ నెల 31వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లనున్నట్టు మొదట నోటీసులు ఇచ్చింది అఖిలపక్షం.. అయితే, కార్మిక సంఘాలతో ఇవాళ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్, ఆర్.ఐ.ఎన్. ఎల్.యాజమాన్యం చర్చలు జరిపింది.. ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.. అయితే, ఆ తర్వాత ఈ నెల 31వ తేదీ నుంచి తలపెట్టిన సమ్మెను వాయిదా వేస్తున్నట్టు…
ఐఎన్ఎస్ ఖుక్రీ… దేశంలో తయారైన మొదటి క్షిపణి సామర్థ్యమున్న యుద్ధనౌక. 1989 లో మజ్గావ్ డాక్లో తయారైంది. 1971 వ సంవత్సరంలో పాక్తో జరిగిన యుద్ధం సమయంలో అప్పటి ఖుక్రీ యుద్ధనౌకను అరేబియా సముద్రంలో పాక్ సైనికులు కూల్చివేశారు. ఆ తరువాత భారత్ కరాచీ రేవు పట్టణంపై బాంబుల వర్షం కురిపించి రేవును స్వాధీనం చేసుకోవడంతో పాక్ ఓటమిని అంగీకరించింది. అప్పటి ఖుక్రీ నౌక అందించిన సేవలకు గుర్తుగా దేశంలో తయారైన తొలి క్షిపణి యుద్ధనౌకకు ఐఎన్ఎస్…
కరోనా తరువాత విశాఖలో విమానయాన రంగం సేవలు క్రమంగా పుంజుకుంటున్నాయి. స్పైస్ జెట్, స్కూట్ ఎయిర్ సర్వీసులు తిరిగి ప్రారంభం అయ్యాయి. జనవరి 1 నుంచి విశాఖ-తిరుపతి, కోల్కతా-విశాఖ స్పైస్ జెట్ విమానాలు నడవబోతున్నాయి. అదేవిధంగా డిసెంబర్ 29 నుంచి విశాఖ-సింగపూర్ మధ్య స్కూట్ ఎయిర్ సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. Read: నేడు తణుకులో సీఎం జగన్ పర్యటన… దీనికి సంబంధించిన టికెట్ల విక్రయాలను విమానయాన సంస్థలు ప్రారంభించింది. కరోనా మహమ్మారి సమయంలో ఈ సర్వీసులను…