కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనతో విశాఖ ఎయిర్ పోర్ట్ దగ్గర హై అలెర్ట్ కొనదగుతుంది. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకారణకు వ్యతిరేకంగా ఆర్ధిక మంత్రికి వినతులు సమర్పించాలని జెఏసీ నిర్ణయం తీసుకుంది. వందల సంఖ్యలో ఎయిర్ పోర్ట్ దగ్గరకు కార్మికులు వస్తారని ముందస్తు సమాచారం రావడంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. ఇక అక్కడికి వచ్చిన స్టీల్ ప్లాంట్ కార్మికులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ముందస్తు అనుమతి లేకపోవడంతో ఎయిర్ పోర్ట్ ఎంట్రన్స్ దగ్గరే అడ్డగిస్తున్నారు. విశాఖ…
గట్టిగా ఉన్నామని అనుకున్నచోట టీడీపీ నేతల లెక్కలు వర్కవుట్ కావడం లేదా? అంతా ఆరంభ శూరత్వమేనా? బలహీనతలు తెలిసీ నేల విడిచి సాము చేస్తున్నారా? కేడర్ వద్దని వారించినా పంతాలకు పోయి.. ఎందుకు పరాజయాలను మూట కట్టుకుంటున్నారు? అది ఎక్కడో.. ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. విశాఖలో కీలక అంశాల్లో టీడీపీ అభాసుపాలు! రాజకీయ చైతన్యానికి విశాఖ వేదిక. ఇక్కడ టీడీపీ కూడా గట్టిగానే ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సిటీలోని నాలుగు ఎమ్మెల్యేల స్థానాల్లో టీడీపీ…
మైనింగ్ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సహజ వనరుల దోపిడీపై ఫిర్యాదు రావడంతో… విశాఖలో క్వారీలపై తనిఖీల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. డ్రోన్లు, జీపీఎస్ ఆధారిత సర్వే ద్వారా అక్రమాల గుర్తించి.. ఇష్టారాజ్యంగా జరుగుతున్న గనుల తవ్వకాలకు చెక్ పెట్టనున్నారు. అనకాపల్లిలోని ఓ మైనింగ్ కంపెనీ కార్యకలాపాలపై విచారణ జరపనుంది సీఐడీ. గనులశాఖ విజిలెన్స్ కూడా ఇప్పటికే భారీగా జరిమానాలు విధించింది. విశాఖలోని వందల క్వారీలు.. కనీస నిబంధనలు కూడా పాటించడం లేదని నిర్ధారించారు.…
విశాఖలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటానికి ఇప్పటికే వివిధ పార్టీలు మద్దతు తెలిపాయి. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయాలని కార్మికులు నిర్ణయం తీసుకున్నారు. స్టీల్‌ప్లాంట్ కోసం పార్లమెంట్లో పోరాడాలని ఇవాళ ఎంపీలను కలిసి విజ్ఞప్తి చేయబోతున్నారు. ఇక, కార్మిక సంఘాలు చేస్తున్న నిరసనలకు, ఆందోళనలకు సీపీఐ మద్దతు తెలిపింది. ఇతర రాజకీయ పార్టీల మద్దతు కూడా కోరాలని కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయం తీసుకుంది. స్టీల్ ప్లాంట్…
మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తొలగించి… ఆ బాధ్యతల్ని సంచయిత గజపతిరాజుకు అప్పగించింది ఏపీ సర్కార్. అయితే, దీనిపై అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన సంచయిత నియామకానికి సంబంధించిన జీవోను కొట్టి వేసింది. దీంతో మాన్సాస్ ట్రస్ట్‌తో పాటు సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త బాధ్యతల్ని తిరిగి చేపట్టారు అశోక్ గజపతిరాజు. అయితే, ఈ వివాదానికి అక్కడితో తెరపడలేదు. విశాఖలో రాష్ట్ర…
పీవీ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకుడు.. కానీ, ఆయన సేవలకు తగిన గౌరవం లభించలేదన్నారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు… మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి సందర్భంగా నివాళులర్పించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పీవీని బహుముఖ ప్రజ్ఞాశాలిగా అభివర్ణించారు.. మాతృభాష పట్ల ఆయనకున్న ప్రేమను గుర్తు చేసుకున్నారు.. ఏ దేశం అయినా సంస్కృతి, వారసత్వం, గొప్ప నాయకుల సేవలను మరచిపోయి ముందుకు సాగలేదన్నారు.. విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకత్వం వహించిన క్రాంతదర్శిగా పీవీని అభివర్ణించిన…
నేడు విశాఖపట్నంకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రానున్నారు. ఉదయం 11.45కు ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకోనున్నారు. విమానాశ్రయంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో పాటుగా తూర్పు నౌకాదళాధిపతి, కలెక్టర్, సీపీ, ఎస్సీ, తదితర అధికారులతో పాటు మేయరు, జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగత కార్యక్రమంలో పాల్గొననున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన విశాఖలోనే బస చేయనున్నారు. 29న ఉదయం 11.30 గంటలకు తిరుగు ప్రయాణమవుతారని అధికారిక ప్రకటనలో తెలిపారు.