India Captain Rohit Sharma Heap Praise on Virat Kohli: వన్డే కెరీర్లో 49వ సెంచరీ చేసిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. కఠిన పరిస్థితుల్లో కోహ్లీ అద్భుతంగా ఆడాడని, అతడు జట్టుకు ఎంతో అవసరం అని తెలిపాడు. కోహ్లీ నుంచి మరెన్నో ఇన్నింగ్స్లు ఆశిస్తున్నామని తెలిపాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ రాణించడం సంతోషంగా ఉందని రోహిత్ పేర్కొన్నాడు. ఆదివారం దక్షిణాఫ్రికాపై భారత్ ఏకంగా 243…
Sachin Tendulkar Feels Virat Kohli’s Will Hits 50th Century in Next Few Days: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. తన 35వ పుట్టిన రోజున వన్డేల్లో 49వ సెంచరీ చేయడం విశేషం. ఈ సెంచరీతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును కోహ్లీ సమం చేశాడు. మరో…
సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును సమం చేయడంపై విరాట్ కోహ్లీ స్పందిస్తూ.. కల నెరవేరిందన్నాడు. భారత్ తరఫున ఆడే ప్రతి అవకాశం తనకు చాలా పెద్దదని తెలిపాడు. తన పుట్టినరోజున ప్రేక్షకుల ముందు ఈ రికార్డు నెలకొల్పడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించే అవకాశమిచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపాడు.
కోహ్లీ ఈ ఘనత సాధించడంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. విరాట్ పై అభినందనల వర్షం కురిపించాడు. బాగా ఆడావు అంటూ కితాబునిచ్చారు. ఈ రోజు విరాట్ బర్త్ డే విషయాన్ని ప్రస్తావిస్తూ చమత్కారంగా వ్యాఖ్యానించారు. "నేను 49 నుంచి 50 ఏళ్ల వయసుకు చేరుకునేందుకు 365 రోజులు పట్టింది... కానీ నువ్వు కొన్ని రోజుల్లోనే 49 నుంచి 50కి చేరుకోవాలని కోరుకుంటున్నాను... తద్వారా నా రికార్డు బద్దలు కొడతావని ఆశిస్తున్నాను" అంటూ సోషల్ మీడియాలో…
సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా భారీ స్కోరు చేసింది. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ (101) సెంచరీతో చెలరేగాడు. తన బర్త్ డే రోజు సెంచరీ సాధించడంతో అభిమానులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రపంచ కప్లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో ఇండియా-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ తన బర్త్ డే రోజున సెంచరీ చేసి.. తన ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇచ్చాడు. 119 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ సెంచరీతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసి చరిత్ర సృష్టించాడు.
వరల్డ్ కప్ 2023లో భాగంగా.. ఇండియా-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా.. నిలకడగా ఆడుతుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (40), గిల్ (23) పరుగులు చేసి మంచి శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీలు చేశారు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ (55), అయ్యర్ (60) పరుగులతో ఉన్నారు.
Happy Birthday Kohli: భారత క్రికెట్ జట్టు వెటరన్ ఆటగాడు విరాట్ కోహ్లీ.. నేడు తన పుట్టినరోజు. ఈ రోజు కోల్కతా మైదానంలో ఆడే మ్యాచ్ ఆయనకు ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి.
Virat Kohli Fan gives biryani just RS 7 in Uttar Pradesh: టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా.. ప్రాంతాలతో సంబంధం లేకుండా అంతటా కోహ్లీకి అభిమానులు ఉంటారు. తన అభిమాన క్రికెటర్ కోహ్లీని కలవాలని కొందరు, ఓ సెల్ఫీ తీసుకోవాలని మరికొందరు చూస్తుంటారు. అయితే ఓ అభిమాని మాత్రం అందుకు బిన్నంగా…
శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో శుభ్మన్ గిల్ సెంచరీ మిస్ అయినప్పటికీ.. అతను అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. గిల్ 92 బంతుల్లో 92 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. శుభ్మన్ గిల్ క్రీజులో నుంచి ముందుకొచ్చి ఆఫ్ సైడ్ అద్భుత షాట్ ఆడాడు. అది చూసి నాన్-స్ట్రైక్లో ఉన్న విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయాడు.