Virat Kohli should play the role of his biopic Says Ranbir kapoor: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 తొలి సెమీ ఫైనల్‌లో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ చూసేందుకు చాలా మంది సెలెబ్రిటీస్ మైదానంకు వచ్చారు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ స్టేడియంకు వచ్చి సందడి చేశారు. మ్యాచ్ ఆరంభానికి ముందు రణబీర్ మైదానంలో స్పోర్ట్స్ నెట్‌వర్క్ వ్యాఖ్యాత జతిన్ సప్రుతో మాట్లాడాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ బయోపిక్‌పై స్పందించాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ మీరు చేయాలనుకుంటున్నారా? అని జతిన్ సప్రు అడగ్గా.. రణబీర్ కపూర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. కోహ్లీ బయోపిక్‌లో అతడు నటిస్తేనే బాగుంటుందని రణబీర్ అభిప్రాయపడ్డాడు. ‘విరాట్ కోహ్లీపై బయోపిక్ తీస్తే.. అందులో కోహ్లీ పాత్రను కోహ్లీనే పోషించాలి. ఎందుకంటే.. విరాట్ చాలా మంది నటుల కంటే మెరుగ్గా కనిపిస్తాడు. కోహ్లీ ఫిట్‌నెస్ కూడా చాలా బాగుంది’ అని రణబీర్ కపూర్ చెప్పాడు.
Also Read: ICC Cricket World Cup 2023: భారత్ వర్సెస్ న్యూజిలాండ్.. కీలక తొలి సెమీస్ లైవ్ అప్‌డేట్స్..
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘యానిమల్’. నేషనల్ క్రష్ రష్మిక మంధాన హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. యానిమల్ విడుదల తేదీకి ఇంకా 15 రోజులు గడువు ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగం పెంచారు. భారీ ఎత్తున చిత్ర యూనిట్ ప్రమోషన్లు చేస్తోంది. ఇందులో భాగంగానే రణబీర్ భారత్-న్యూజిలాండ్ సెమీస్‌లో సందడి చేశాడు.
Jatin sapru -: Would you like to do Kohli’s biopic?
Ranbir kapoor -: If a Biopic is made on Virat Kohli, then Kohli should play the role of Kohli in it because Virat looks better than many actors & his fitness is also very good. pic.twitter.com/LlhFP2kgou
— Arun Singh (@ArunTuThikHoGya) November 15, 2023