వరల్డ్ కప్ 2023లో భాగంగా నిన్న బెంగళూరు వేదికగా టీమిండియా-నెదర్లాండ్స్ మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరిగింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 160 పరుగుల తేడాతో గెలిచింది. భారత్ బ్యాటర్లు శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సెంచరీలతో చెలరేగారు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బౌలింగ్ వేసి ప్రేక్షకుల కోరిక తీర్చారు.
Read Also: Tamil Movies : ఆ రెండు సినిమాలకు షాక్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులు..
అంతేకాకుండా.. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో అదరగొట్టగా, బౌలింగ్ లో కూడా ఔరా అనిపించాడు. తాను వేసిన రెండో ఓవర్ లో ఓ వికెట్ తీశాడు. అటు రోహిత్ శర్మ కూడా బౌలింగ్ చేసి ఓ వికెట్ పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం.. మైదానంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. నెదర్లాండ్స్ క్రికెటర్ రైలోఫ్ వాన్డెర్మెర్వ్కు కోహ్లీ ఓ గిఫ్ట్ ఇచ్చాడు. తన సంతకంతో కూడిన జెర్సీని వాన్ డెర్ మెర్వ్ కు అందించాడు. కోహ్లీ జెర్సీని గిఫ్ట్ గా అందుకున్న ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎంతో గొప్పగా ఫీలయ్యాడు. అంతేకాకుండా.. కోహ్లీకి కృతజ్ఞతలు తెలియజేశాడు. వాన్డెర్మెర్వ్ గతంలో సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడగా.. ఆ జట్టులో అవకాశాలు రావడంతో నెదర్లాండ్స్ తరఫున ఆడుతున్నాడు.
ఇదిలా ఉంటే.. ఈనెల 15న తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఆ మ్యాచ్ లో భారత్-న్యూజిలాండ్ తలపడనున్నాయి. 16న సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లు పోటీపడనున్నాయి. ఇక ఫైనల్ లో ఏ జట్టు తలపడుతుందో చూడాలంటే.. 19వ తేదీవరకు వేచిచూడాల్సిందే.