Team India: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ముందుగా బౌలింగ్ చేసిన భారత్ 410 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్యాన్ని ఛేదించేందుకు నెదర్లాండ్స్ బరిలోకి దిగింది. అయితే స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ ఉన్నట్టుండి.. కోహ్లీ, రోహిత్ శర్మ బౌలింగ్ చేయాలని కోరారు. దీంతో అరుపులతో స్టేడియం మొత్తం మోత మోగింది.
Crowd asking Rohit Sharma to give the ball to Virat Kohli….!!!!pic.twitter.com/6FYtHhPR0v
— Johns. (@CricCrazyJohns) November 12, 2023
దీంతో ఫ్యాన్స్ కోరిక తీర్చేందుకు కోహ్లీ రంగంలోకి దిగాడు. బౌలింగ్ చేశాడు.. అంతేకాదు, తను వేసిన రెండో ఓవర్ లో వికెట్ పడగొట్టాడు. దీంతో స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ మొత్తం ఖుషీ అయ్యారు. అటు అనుష్క శర్మ కూడా వికెట్ తీయడంతో స్మైల్ ఇచ్చి మరింత జోష్ నింపింది. ఇదిలా ఉంటే కోహ్లీ ఇంతకుముందు 2016లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో తన మొదటి వికెట్ ను సాధించాడు.
https://twitter.com/musafir_tha_yr/status/1723708597270352218
ఈ ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఇంతకుముందు కూడా బౌలింగ్ చేశాడు. భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. ఆ తర్వాత అతను తన ఓవర్ పూర్తి చేయలేకపోయాడు. దీంతో హార్దిక్ పాండ్యా వేసిన ఓవర్‌ను విరాట్ కోహ్లీ పూర్తి చేశాడు. మరోవైపు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కోరిక తీర్చాడు. మరి రోహిత్ శర్మ ఎప్పుడు బౌలింగ్ చేస్తాడోనని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.