Virat Kohli batting as a left-hander ahead of IND vs NZ Semi Final 2023: వన్డే ప్రపంచకప్ 2023లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు సెమీస్ మ్యాచ్ ప్రారంభం కానుంది. లీగ్ దశలో 9 మ్యాచ్‍ల్లో గెలిచి ఊపుమీదున్న భారత్.. సెమీస్‍లోనూ అదే జోరును కొనసాగించి ఫైనల్ చేరాలని చూస్తోంది. మరోవైపు మరోసారి టీమిండియాను సెమీస్‍లో ఓడించి ఫైనల్ చేరాలని కివీస్ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో సెమీస్ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‍లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేయనున్నాడా? అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు కారణం కోహ్లీకి సంబందించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడమే.
భారత్, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్‍కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో విరాట్ కోహ్లీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేశాడు. మంగళవారం వాంఖెడే స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ సమయంలో కోహ్లీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ సాధన చేశాడు. స్విచ్ షాట్లను ట్రై చేశాడు. అంతేకాదు రివర్స్ స్వీప్ షాట్లు కూడా ఆడాడు. ఇందుకు సంబందించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. సెమీ ఫైనల్ మ్యాచ్‍లో కోహ్లీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తాడా? అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. స్విచ్ షాట్స్ ట్రై చేస్తాడేమో అని మరికొందరు ట్వీట్స్ చేస్తున్నారు. సెమీస్ రికార్డ్స్ అస్సలు బాలేవు, ప్రయోగాలు చెయ్యొద్దంటూ ఇంకొందరు అభిమానులు పోస్టులు పెడుతున్నారు.
Also Read: IND vs NZ Toss: భారత్ టాస్ గెలిస్తే.. రోహిత్ శర్మకు సన్నీ సలహా ఇదే!
వన్డే ప్రపంచకప్ 2023లో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. 9 మ్యాచుల్లో 99 సగటుతో 594 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. లీగ్ స్టేజ్‌లో న్యూజిలాండ్‌పై 95 పరుగులు చేసి భారత విజయంలో కోహ్లీ కీలక పాత్ర పోషించిన కోహ్లీ.. సెమీస్ మ్యాచ్‍లో కూడా చెలరేగాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. అయితే సెమీస్ మ్యాచ్‍లలో కోహ్లీకి గొప్ప గణాంకాలు లేవు. అయితే ఈసారి ఫామ్‌ను చూస్తుంటే.. సెమీస్‌లో ఆడడనే అపవాదును చెరిపేసె అవకాశాలు ఉన్నాయి.
Virat Kohli batting as a left-hander in the practice session. [Sportstar] pic.twitter.com/NL33UW61v9
— Johns. (@CricCrazyJohns) November 15, 2023