T20 WorldCup 2024 : టి20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ లో ఆధ్యాంతం ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ ను ఉద్దేశించి తాజాగా ఆస్ట్రేలియా మీడియా మరోసారి టీమిండియా పై విషాన్ని చిమ్మింది. 2024 టి20 ప్రపంచ కప్ లో టీమిండియా విజయాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ.. తన అక్కసును బయటపెట్టింది ఆసీస్ మీడియా. ఒక ఆసీస్ మీడియా తప్పించి మిగతా అంతర్జాతీయ మీడియా సంస్థలు అన్నీ కూడా టీమిండియా విజయాన్ని ప్రశంసిస్తూ కథనాలు ప్రచురిస్తే.. వారు…
T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్లో భారత్ దక్షిణాఫ్రికాను ఓడించి. దక్షిణాఫ్రికాపై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని గెలుచుకుంది.
విదేశీ గడ్డపై భారత జట్టు మరోసారి చరిత్ర సృష్టించింది. రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను గెలుచుకుంది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత టీమిండియాకు అభినందనలు తెలిపే ప్రక్రియ మొదలైంది.
Virat Kohli Retirement: టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. శనివారం రాత్రి బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ అనంతరం విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. భవిష్యత్తు తరాలకు అవకాశం ఇవ్వాలనే తాను అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకుంటున్నట్లు కింగ్ కోహ్లీ స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను…
IND vs SA Final: టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో మంచి స్కోరును సాధించింది. భారత్ 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.
మరికొన్ని గంటల్లోనే టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు భారత్, దక్షిణాఫ్రికా మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
IND vs SA Final: నేడు టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాతో తలపడుతుంది టీమిండియా. బార్బడోస్ వేదికగా మ్యాచ్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు మొదలు కానుంది. ఒకవేళ వర్షం వల్ల అంతరాయం కలిగితే.. రేపు రిజర్వ్ డే రోజున మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్ జరగకుంటే ఇద్దరినీ విజేతలుగా ప్రకటిస్తారు. ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరిన భారత్,…