IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్.. ముగ్గురు స్టార్ ప్లేయర్స్ ఔట్!
- శ్రీలంకతో వన్డే సిరీస్
- ముగ్గురు స్టార్ ప్లేయర్స్ దూరం
- జులై 27 నుంచి ఆరంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma and Virat Kohli Might Skip Sri Lanka ODIs: భారత్ ప్రస్తుతం జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడుతోంది. ఆపై శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జులై 27 నుంచి ఆరంభం కానుండగా.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆగష్టు 2 నుంచి మొదలవనుంది. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముగ్గురు స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలు దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
రోహిత్ శర్మ 2023 డిసెంబరు నుంచి ఆరు నెలలుగా మ్యాచ్‌లు ఆడుతూనే ఉన్నాడు. విరాట్ కోహ్లీ మధ్యలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్నా.. ఆపై ఐపీఎల్ 2024, టీ20 ప్రపంచకప్ 2024లో ఆడాడు. రోహిత్, కోహ్లీలు ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. లంకతో వన్డే సిరీస్ అనంతరం బంగ్లాదేశ్‌తో భారత్ రెండు టెస్టులు ఆడుతుంది. ఆ సిరీస్‌కు ఈ ఇద్దరు అందుబాటులోకి రానున్నారు.
Also Read
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
Also Read: PV Sindhu: మరోసారి పతాకధారిగా పీవీ సింధు!
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ అనంతరం న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు భారత్ ఆడనుంది. ఇక ఈ ఏడాది చివర్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్తుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023-2025 ఫైనల్ లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లు రోహిత్ సేనకు కీలకం కానున్నాయి. రోహిత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలలో ఒకరు శ్రీలంక వన్డే సిరీస్‌లో జట్టును నడిపించే అవకాశముంది.
తాజావార్తలు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!