Virat Kohli leaves for London after T20 World Cup Celebrations: వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత జట్టు గురువారం స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. ముంబైలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న టీమిండియా.. ఆపై వాంఖడె స్టేడియంలో బీసీసీఐ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొంది. ప్రపంచకప్ విజయోత్సవాల అనంతరం టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ.. రాత్రికి రాత్రే లండన్‌కు బయల్దేరాడు. ముంబై విమానాశ్రమంలోకి విరాట్ వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
విరాట్ కోహ్లీ ఉన్నపలంగా లండన్‌కు ఎందుకు వెళ్లిపోయాడని ఫాన్స్ ఆరా తీస్తున్నారు. విరాట్ తన కుటుంబాన్ని కలిసేందుకు లండన్‌కు పాయమయ్యాడట. కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ప్రస్తుతం పిల్లలతో (వామికా, అకాయ్) కలిసి లండన్‌లో ఉన్నారు. వారిని కలిసేందుకు ముంబై నుంచి రాత్రికి రాత్రే లండన్ వెళ్లిపోయాడు. తుపాను కారణంగా బార్బడోస్‌లో విరాట్ చిక్కుకుపోయాడు. తుఫాను తగ్గిన వెంటనే.. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో విరాట్ సహా టీమిండియా ప్లేయర్స్ జూలై 4న భారతదేశానికి వచ్చారు.
Also Read: Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమాపై పోస్ట్.. అభిమానికి డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్!
అకాయ్‌కు జన్మనిచ్చేందుకు అనుష్క శర్మ లండన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15న అకాయ్ జన్మించాడు. అప్పటినుంచి అనుష్క లండన్‌లోనే ఉంటున్నారు. విరాట్ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పట్లో అతడు టీమిండియాకు ఆడే అవకాశం లేదు. జులై ఆఖరులో శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్ ఉన్నప్పటికీ.. విరాట్ ఆడే అవకాశాలు లేవు. అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ సమయానికి విరాట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.