న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు భారత బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. మొదటి టెస్టు రెండోరోజు ఆటలో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై కివీస్ బౌలర్లు చెలరేగడంతో టీమిండియా స్టార్ బ్యాటర్లు కుదేలయ్యారు. రోహిత్ శర్మ (2) ఖాతా తెరవగా.. విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు డకౌట్ అయ్యారు. ప్రస్తుతం భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. రిషబ్ పంత్ ఆడుకుంటేనే భారత్ కోలుకుంటుంది.…
Virat Kohli Duck in IND vs NZ 1st Test: బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. 9 బంతులు ఎదుర్కొన్న విరాట్.. పరుగుల ఖాతానే తెరవలేదు. విలియమ్ ఓరూర్కీ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్ పట్టడంతో కింగ్ పెవిలియన్‌కు చేరాడు. కోహ్లీ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘కోహ్లీ పెద్ద గుడ్డు పెట్టాడు’ అంటూ నెటిజన్స్…
భారత్-న్యూజీలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ ఆరంభం అయింది. నవంబర్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. గతంలో రెండుసార్లు టీమిండియా ట్రోఫీ దక్కించుకోవడంతో.. ఈసారి ఆసీస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ట్రోఫీకి సంబంధించి ఆస్ట్రేలియా మీడియా ‘ఫాక్స్ క్రికెట్’ విశ్లేషణలతో కూడిన ఓ వీడియోను, పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అయితే బార్మీ ఆర్మీ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు.. భారత అభిమానులకు…
Virat Kohli Nine Thousand Test Runs Record: సొంతగడ్డపై బంగ్లాదేశ్‌ను టెస్టు, టీ20 ఫార్మాట్లో క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. స్వదేశంలో మరో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. బుధవారం (అక్టోబర్ 16) నుంచి న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. బెంగళూరు వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే.. కివీస్ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం. గెలుపే లక్ష్యంగా రోహిత్ సేన బరిలోకి దిగుతోంది. అయితే కివీస్‌తో…
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తిరిగి పుంజుకుంటాడని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. విరాట్ ప్రపంచ స్థాయి క్రికెటర్ అని, అరగేంట్రం చేసినప్పుడు ఉన్న పరుగుల దాహం అతడిలో ఇప్పటికీ ఉందన్నాడు. కివీస్, ఆస్ట్రేలియాలతో జరిగే సిరీస్‌ల్లో కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వస్తాడని గంభీర్ పేర్కొన్నాడు. 2024లో మూడు టెస్టులు ఆడిన విరాట్.. 50 ప్లస్ స్కోర్ సాధించలేకపోయాడు. దీంతో అతడి ఫామ్‌పై విమర్శలు వస్తున్నాయి. ఈ…
India vs New Zealand: భారత్ వేదికగా అక్టోబర్ 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ విరాట్ కోహ్లీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. 2025లో భారత్ ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ టూర్ విరాట్ కోహ్లికి చివరిదని బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. వచ్చే ఏడాది జూన్ 20 నుంచి జులై 31 మధ్య ఇంగ్లండ్‌తో భారత్ ఐదు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ సమయంలో కోహ్లీకి 36 ఏళ్లు నిండుతాయి. ఈ క్రమంలో.. 2025 టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ గడ్డపై విరాట్ కోహ్లీ చివరి…
Anushka Sharma Bowling to Virat Kohli: భారతదేశంలోని మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ కపుల్స్‌లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ముందు వరసలో ఉంటారు. ఒకరు క్రికెట్ స్టార్, మరొకరు సినీ సెలబ్రిటీ కావడంతో.. ప్రతి ఒక్కరి దృష్టి ఈ జోడీపైనే ఉంటుంది. దాంతో విరుష్క జోడి ఏం చేసినా నిమిషాల్లో వైరల్ అవుతుంటుంది. తాజాగా కోహ్లీ, అనుష్క కలిసి క్రికెట్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కింగ్ కోహ్లీకే అనుష్క క్రికెట్ రూల్స్…
Virat Kohli Gifts His bat to Shakib Al Hasan: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్‌కు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చాడు. మంగళవారం కాన్పూర్‌లో బంగ్లాదేశ్‌తో ముగిసిన రెండో టెస్టు మ్యాచ్ అనంతరం షకిబ్ దగ్గరకు వెళ్లిన విరాట్.. సంతకం చేసిన తన బ్యాట్‌ను అతడికి అందించాడు. ఆపై ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. కోహ్లీ బ్యాట్‌తో షకిబ్ షాడో సాధన చేశాడు. స్వదేశంలో వీడ్కోలు పలికే అవకాశం…
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ సూపర్ విక్టరీ సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 95 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ సేన మూడు వికెట్లు కోల్పోయి అందుకున్నది. దీంతో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. కెప్టెన్ రోహిత్ (8), గిల్ (6) విఫలమైనప్పటికీ.. జైస్వాల్ (51), కోహ్లీ (29 నాటౌట్) రాణించారు. ఈ సిరీస్ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టాప్‌లో…