IND vs NZ 3rd Test Match: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో టీమిండియా మరోసారి తడబడుతోంది. తొలి రెండు టెస్టులలో ఓడిన టీమిండియా చివరి గేమ్‌లోనూ పేలవ ప్రదర్శన చేసేలా కనపడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌ను 235 పరుగులకే పరిమితం చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. దింతో ఇంకా 149 పరుగులు వెనుకబడి ఉంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (18), విరాట్ కోహ్లీ (4) మళ్లీ నిరాశపరిచారు. జైస్వాల్ (30) ఫర్వాలేదనిపించిన.. నైట్ వాచ్మెన్ గా వచ్చిన మహ్మద్ సిరాజ్ డక్ అవుట్ అయ్యాడు. ఆట మొదటి రోజు ముగిసే సమయానికి శుభ్‌మన్ గిల్ (31), రిషబ్ పంత్ (1) క్రీజ్ లో ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ రెండు వికెట్లు, హెన్రీ ఒక వికెట్ తీశారు.
Also Read: CM Chandrababu: ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు.. కానీ మనస్సు, మానవత్వం ఉంది..
ఇకపోతే, తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ భారత స్పిన్నర్ల ధాటికి తక్కువ పరుగులకే పరిమితమైంది. కీలక సమయాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు. ఓపెనర్లు లాథమ్ (28), కాన్వాయ్ (4) స్వల్ప పరుగులకే వెనుదిరగడంతో బ్యాట్స్మెన్ పై ఒత్తిడి పెరిగింది. తొలి అర్ధభాగంలో వచ్చిన విల్ యంగ్ (71), మధ్యలో వచ్చిన మిచెల్ (82) పరుగులతో ఆదుకున్నారు. వీరు తప్పించి మిగతా బ్యాట్స్‌మెన్ అందరూ తక్కువ స్కోర్‌లకే పరిమితమయ్యారు. టీమిండియా నుండి రవీంద్ర జడేజా (5), వాషింగ్టన్ సుందర్ (4) వికెట్లు తీశారు.
Read Also: First Analog Space Mission: మొట్టమొదటి అనలాగ్ మిషన్‌ను ప్రారంభించిన ఇస్రో
ఈ మ్యాచ్‌లో జడేజా ఐదు వికెట్లు పడగొట్టి మరో ఘనత సాధించాడు. అతను మొత్తం 314 వికెట్లు పడగొట్టి భారత టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా నిలిచాడు. ఇషాంత్ శర్మ (311), జహీర్ ఖాన్ (311) ధాటి అతను ఈ జాబితాలో ఐదో స్థానానికి చేరుకున్నాడు. భారత టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు (619) సాధించిన ఆటగాడిగా అనిల్ కుంబ్లే రికార్డు సృష్టించాడు. రవిచంద్రన్ అశ్విన్ (533), కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (417) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.