IPL 2025 RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ ప్రారంభానికి ఇంకా ఒక్కరోజే ఉంది. ఈసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్యాన్స్ తమ టీమ్ ట్రోఫీ విజయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతి సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా ఆర్సిబి జట్టుకు మద్దతుగా నిలిచేందుకు ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. ఇకపోతే, ఈసారి ఆర్సీబీ కొత్త కెప్టెన్ రజత్ పటీదార్ నాయకత్వంలో తన ప్రస్థానం మొదలు పెట్టనుంది. గత సీజన్లలో ఫాఫ్…
టీమిండియా పేసర్, హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ ఏడేళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఆడిన విషయం తెలిసిందే. ఆర్సీబీలో కీలక ఆటగాడిగా ఉన్న సిరాజ్‌ను ఐపీఎల్ 2025 వేలంలో ఆ ప్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. వేలంలో గుజరాత్ టైటాన్స్ అతడిని రూ.12.50 కోట్లకు కొనుగోలు చేసింది. కొన్నేళ్లుగా ఆర్సీబీ జట్టు ఆటగాళ్లతో మంచి అనుబంధం ఉన్న సిరాజ్.. ప్రాంచైజీని వీడటంపై తాజాగా స్పందించాడు. విరాట్ కోహ్లీ తనకు మద్దతుగా నిలిచాడని, ఆర్సీబీని వీడటం తనను…
Tanmay Srivastava: క్రికెట్ అంటే కేవలం ఆటగాళ్ల మధ్య పోటీ మాత్రమే కాదు. ఎటువంటి తప్పులు జరగకుండా, నిబంధనల ప్రకారం మ్యాచ్‌ను నిర్వహించడం కూడా అంతే ముఖ్యమైన అంశం. ఒక మ్యాచ్ సజావుగా సాగడానికి అంపైర్ పాత్ర ఎంతో కీలకమైనది. ఫీల్డ్ అంపైర్లు, థర్డ్ అంపైర్, ఫోర్త్ అంపైర్ కలిసి ఆటను పర్యవేక్షిస్తుంటారు. అయితే, ఇప్పటి వరకు క్రికెట్ ఆడిన ఆటగాళ్లు ఆ తర్వాత కోచ్‌లు, కామెంటేటర్లుగా మారడం సహజమే. కానీ, ఐపీఎల్ 2025లో ఓ మాజీ…
బీసీసీఐ నిర్ణయంపై టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫైర్ అయ్యాడు. క్రికెటర్స్ విదేశీ టూర్లో ఉన్నప్పుడు వారి వెంట కుటుంబ సభ్యులను తీసుకెళ్లొద్దు అంటూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని కోహ్లీతో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్లు తప్పుబట్టారు. ఈ క్రమంలో.. ఈ నిర్ణయాన్ని సవరించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. 18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. అన్ని ఫ్రాంచైజీలు తమ జట్లను బలోపేతం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సోమవారం నిర్వహించిన "అన్బాక్సింగ్ ఈవెంట్" ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
"ఈ సాలా కప్ నమ్దే" నినాదం గురించి డివిలియర్స్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఏబీ డివిలియర్స్ 2011 నుంచి 2021 వరకు ఆర్సీబీ తరపున 11 సీజన్లలో ఆడాడు. అయితే ఇటీవల విరాట్ కోహ్లీ నుండి ఒక ప్రత్యేక సందేశం అందుకున్నట్లు డివిలియర్స్ చెప్పారు. కోహ్లీ తనకు "ఈ సాలా కప్ నమ్దే" అనే పదాన్ని ఉపయోగించవద్దని కోరినట్లు ఏబీ డివిలియర్స్ వెల్లడించారు.
Virat Kohli : బీసీసీఐ నిర్ణయంపై కోహ్లీ ఫైర్ అయ్యాడు. క్రికెటర్స్ విదేశీ టూర్ లో ఉన్నప్పుడు వారి వెంట కుటుంబ సభ్యులను తీసుకెళ్లొద్దు అంటూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని కోహ్లీ తీవ్రంగా తప్పుబట్టాడు. మ్యాచ్ ఆడే సమయంలో ఆటగాళ్లు చాలా ఒత్తిడితో ఉంటారని.. అలాంటి సమయంలో వారికి మద్దతుగా కుటుంబ సభ్యులు ఉండటంలో తప్పులేదన్నాడు. వాళ్లకు కుటుంబ సభ్యులు తోడుగా ఉంటే ఒత్తిడిని అధిగమించి మెరుగ్గా ఆడుతారంటూ చెప్పాడు.…
Orange Cap Holders: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రతి సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌ను ఆరెంజ్ క్యాప్ తో గౌరవిస్తుంది. ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవడం ఓ బ్యాట్స్‌మన్‌కి తన కెరియర్లో మరింత ముందుకు వేలెందుకు ఎంతగానో సహాయపడుతుంది. గత 17 సంవత్సరాల్లో ఈ జాబితాలో చాలా మంది దిగ్గజ ఆటగాళ్లు తమ ముద్ర వేశారు. ప్రత్యేకంగా, విరాట్ కోహ్లీ 2016లో 973 పరుగులు చేసి ఇప్పటివరకు అత్యధిక పరుగుల రికార్డు కైవసం చేసుకున్నాడు.…
Virat Kohli : విరాట్ కోహ్లీ సెన్సేషనల్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఒక్క మ్యాచ్ కోసం తన రిటైర్మెంట్ ను వెనక్కు తీసుకుంటానంటూ ప్రకటించేశాడు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ ఫార్మాట్ కు విరాట్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన రిటైర్మెంట్ మీద యూటర్న్ తీసుకున్నాడు విరాట్. దానికి కారణం ఒలంపిక్స్. 2028లో లాస్ ఏంజెల్స్ లో జరిగే ఒలంపిక్స్ లో క్రికెట్ ను చేర్చనున్నారు. ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో విరాట్ కోహ్లీ ఒకడు. ముందు బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్ అయినా.. పిచ్ ఏదైనా.. బౌలర్ ఎవరైనా పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు 252 ఐపీఎల్ మ్యాచ్‌లలో 8,004 పరుగులు చేయగా.. ఇందులో 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత 17 సంవత్సరాలుగా ఒకే ఫ్రాంచైజీకి నిలకడగా ఆడుతున్న ఏకైక ప్లేయర్ కూడా కోహ్లీనే. ఐపీఎల్ 2025 మార్చ్ 22 నుంచి ఆరంభం కానుండగా.. విరాట్…