సోమవారం ముంబై ఇండియన్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 222 పరుగుల భారీ ఛేదనలో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసి ఓడింది. తిలక్ వర్మ (56; 29 బంతుల్లో 4×4, 4×6), హార్దిక్ పాండ్యా (42; 15 బంతుల్లో 3×4, 4×6) ముంబైని గెలిపించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్యా (4/45), జోష్ హేజిల్‌వుడ్ (2/37),…
RCB vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్లో భాగంగా నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బెంగళూరు జట్టు బ్యాటింగ్‌లో ఆదిలోనే కీలక వికెట్లు…
వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్.. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల తరపున ఆడాడు. 142 మ్యాచ్‌ల్లో 4,965 పరుగులు చేశాడు. ఐపీఎల్ కెరీర్లో ఆరు సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు బాదాడు. బెంగళూరు తరఫున రెండుసార్లు ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. ఐపీఎల్లో గేల్ 357 సిక్సర్లు బాదాడు, ఇది ఇప్పటికీ ఓ రికార్డు. అంతేకాదు అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు ఇప్పటికీ గేల్ (175)…
టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే. అప్పటినుంచి కింగ్ టెస్ట్, వన్డేలు ఆడుతున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అనంతరం వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే విరాట్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అప్పటినుంచి అతడి రిటైర్మెంట్పై ఊహాగానాలు వస్తున్నాయి. వీటన్నింటికీ విరాట్ తాజాగా చెక్ పెట్టాడు. వన్డే ప్రపంచకప్ 2027 వరకూ తాను ఆడతానని…
ఐపీఎల్ 2025లో భాగంగా.. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 50 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో 17 ఏళ్ల తర్వాత ఆర్సీబీ చెన్నై చెపాక్ కోటను బద్దలు కొట్టింది. దీంతో బెంగళూరు ఫ్యాన్స్ ఆనందోత్సాహాలతో మునిగిపోయారు. ఈ విజయం అనంతరం.. ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన సహచరులతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నాడు.
రజత్ పాటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 9వ మ్యాచ్‌లో విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌ను 50 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది వరుసగా రెండో విజయం. ఈ విజయంతో బెంగళూరు జట్టు 17 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత సీఎస్కేని వారి సొంత మైదానంలో ఓడించింది. చెన్నై కంచు కోటను కూడా బద్దలు కొట్టగలిగింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ అర్ధ…
మ్యాచ్‌లో ఓ కీలక ఘట్టం మతిష పతిరానా వేసిన బౌన్సర్ కారణంగా చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీ ఈ బౌన్సర్‌ను భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్‌కు తాకిన తర్వాత హెల్మెట్‌కు తాకింది. ఇది చూసి స్టేడియంలో ఉన్న అభిమానులు కాస్త భయాందోళనకు గురయ్యారు. అయితే.. కోహ్లీ కొంత సమయం తర్వాత మళ్లీ ఆట కొనసాగించాడు. ఈ క్రమంలో.. పతిరానా మరో బౌన్సర్ వేయగా, కోహ్లీ ఆ బంతిని ఫైన్ లెగ్ వైపు సిక్స్‌గా…
ఐపీఎల్ 2025లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. సీఎస్కే ముందు 197 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఐపీఎల్ 2025లో భాగంగా.. కాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఐపీఎల్ 2025లో ఈరోజు హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య ఆసక్తికర పోరు ఉండనుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కొత్త రికార్డును సాధించే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్‌పై 1053 పరుగులు చేశాడు. కేవలం ఐదు పరుగులు చేస్తే.. అతను చెన్నైపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవనున్నాడు.