Virat Kohli-Bharat Ratna: భారత క్రికెట్‌కు తన జీవితాన్ని అంకితం చేసిన విరాట్ కోహ్లీకి భారత రత్న అవార్డును ఇవ్వాలని టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కోరారు. కొద్ది రోజుల క్రితమే టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లీ, తన ఫ్యాన్స్‌కు ఓ తీపి జ్ఞాపకంగా ఢిల్లీ వేదికగా ఒక రిటైర్మెంట్ మ్యాచ్ నిర్వహించాలని రైనా అభిప్రాయపడ్డారు. విరాట్ కోహ్లీ మే 12న టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కోహ్లీ 123 టెస్ట్ మ్యాచ్‌ల్లో 9230 పరుగులు చేసి, 30 శతకాలు సాధించి, భారతదేశం తరఫున నాలుగవ అత్యధిక పరుగుల సాధకుడిగా నిలిచారు.
Read Also: RCB Playoffs: ఈ సాలా కప్ నమ్దే.. ఇదే జరిగితే ఆర్‌సీబీ ప్లేఆఫ్ రేసు నుంచి అవుట్..!
ఇకపోతే శనివారం (మే 17)న బెంగళూరులో జరిగిన IPL 2025 మ్యాచ్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన రైనా, కోహ్లీ సాధించిన ఘనతలను ప్రస్తావించారు. విరాట్ కోహ్లీ భారత క్రికెట్‌కు చేసిన సేవలు అమోఘం. ఆటగాడిగా, కెప్టెన్‌గా ఎన్నో విజయాలను అందించాడని.. ఆయనకు భారతరత్న ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని రైనా అన్నారు. ఇప్పటి వరకు కేవలం 2014లో సచిన్ టెండూల్కర్‌కే భారతరత్న లభించింది.
Read Also: USA: కాలిఫోర్నియాలోని ఆసుపత్రి సమీపంలో బాంబు పేలుడు.. ఒకరు మృతి
అంతేకాకుండా, విరాట్ కోహ్లీ కోసం ఢిల్లీ వేదికగా ప్రత్యేక రిటైర్మెంట్ మ్యాచ్ నిర్వహించాలని రైనా BCCIని కోరారు. ఆయన కుటుంబ సభ్యులు, కోచ్ కూడా ఆ సమయంలో అతనికి మద్దతుగా ఉండేవారు. దేశానికి అంతటి సేవ చేసిన తరువాత అతనితో మాట్లాడి, ఒక రిటైర్మెంట్ మ్యాచ్ ఇవ్వడం అవసరం అని రైనా అన్నారు. ఇకపోతే, మే 17న బెంగళూరులో జరిగిన RCB, KKR మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా.. విరాట్ కోహ్లీ కోసం చిన్నస్వామి స్టేడియంలో అభిమానులు తెల్ల జెర్సీలతో హాజరయ్యారు.