ఈ ఏడాది చివరలో ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆడటం కష్టమే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విఫలమైన రోహిత్.. ఈ సిరీస్‌లో పాల్గొనకూడదని అతను నిర్ణయించుకున్నట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. మరోవైపు.. బీజీటీలో ఫెయిల్ అయిన కోహ్లీ మాత్రం ఆడనున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సెంచరీ (97) మిస్ అయింది. మూడో స్థానంలో దిగిన శ్రేయస్.. ఫోర్లు, సిక్సులతో చెలరేగి 17 ఓవర్ పూర్తయ్యేసరికే 90 రన్స్ చేశాడు. అప్పటికి ఇంకా 3 ఓవర్లు ఉండడంతో శ్రేయస్ సెంచరీ లాంఛనమే అని అందరూ అనుకున్నారు. అయితే చివరి 3 ఓవర్లలో 4 బంతులను మాత్రమే ఆడాడు. శశాంక్ సింగ్ ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకోవడంతో.. శ్రేయస్ సెంచరీకి…
ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని కలవడానికి ఓ అభిమాని గ్రౌండ్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. "నేను కోహ్లీ సర్ పాదాలను తాకిన వెంటనే ఆయన నా పేరు అడిగి, 'జల్దీ సే భాగ్ జా (వేగంగా పారిపో)' అని చెప్పారు. అంతేకాకుండా.. భద్రతా సిబ్బంది నన్ను కొట్టవద్దని కూడా కోరారు" అని రీతుపర్ణో పఖిరా టైమ్స్ ఆఫ్ ఇండియాకు వెల్లడించాడు.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోన్న నేపథ్యంలో, హైదరాబాద్ గ్రీన్స్ సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్, క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సొసైటీ నిర్ణయించింది. ఈ ముగ్గురు ప్రముఖులు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించారని, అయితే వారిని వదిలేసి యూట్యూబర్లను మాత్రమే టార్గెట్ చేయడం సబబు కాదని సొసైటీ ఆరోపిస్తోంది. గత…
ఐపీఎల్ 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. ఐపీఎల్ 18వ సీజన్ సందడి చేస్తోంది. క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ అందిస్తోంది. ఈ సీజన్ లో భాగంగా తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయదుందుభి మోగించింది. ఐపీఎల్ 18వ సీజన్ లో ఆర్సీబీ బోణీ కొట్టింది. 7 వికెట్ల తేడాతో కోల్ కతాపై ఆర్సీబీ ఘన విజయం సాధించింది.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ ప్రారంభమైంది. 2008లో ప్రారంభమైన ఈ మెగా లీగ్.. ఇప్పటికే 17 సీజన్లు పూర్తి చేసుకుంది. 8 జట్లతో మొదలైన ఈ లీగ్ లో ప్రస్తుతం పది టీమ్స్ ఉన్నాయి. మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడతున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి మరో రికార్టు సృష్టించాడు. టీ20 క్రికెట్లో విరాట్ 400వ మ్యాచ్ ఆడుతున్నాడు.…
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ శైలి గురించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఒక ఆసక్తికరమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐపీఎల్లో రోహిత్ శర్మ దూకుడు విధానాన్ని విరాట్ కోహ్లీ అవలంబించకూడదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అభిప్రాయపడ్డాడు.
ఆర్సీబీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఈసారి అట్టడుగున నిలుస్తుందని జోస్యం చెప్పారు. ఆర్సీబీ అంటే తనకేమీ ద్వేషం లేదని.. కోహ్లీకి కూడా తానెప్పుడూ వ్యతిరేకం కాదన్నారు.
IPL 2025 RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ ప్రారంభానికి ఇంకా ఒక్కరోజే ఉంది. ఈసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్యాన్స్ తమ టీమ్ ట్రోఫీ విజయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతి సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా ఆర్సిబి జట్టుకు మద్దతుగా నిలిచేందుకు ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. ఇకపోతే, ఈసారి ఆర్సీబీ కొత్త కెప్టెన్ రజత్ పటీదార్ నాయకత్వంలో తన ప్రస్థానం మొదలు పెట్టనుంది. గత సీజన్లలో ఫాఫ్…
టీమిండియా పేసర్, హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ ఏడేళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఆడిన విషయం తెలిసిందే. ఆర్సీబీలో కీలక ఆటగాడిగా ఉన్న సిరాజ్‌ను ఐపీఎల్ 2025 వేలంలో ఆ ప్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. వేలంలో గుజరాత్ టైటాన్స్ అతడిని రూ.12.50 కోట్లకు కొనుగోలు చేసింది. కొన్నేళ్లుగా ఆర్సీబీ జట్టు ఆటగాళ్లతో మంచి అనుబంధం ఉన్న సిరాజ్.. ప్రాంచైజీని వీడటంపై తాజాగా స్పందించాడు. విరాట్ కోహ్లీ తనకు మద్దతుగా నిలిచాడని, ఆర్సీబీని వీడటం తనను…