ఐసీసీ పురుషుల టీ 20 ప్రపంచకప్ లోని సూపర్ 12 మ్యాచ్ లో నిన్న న్యూజిలాండ్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో భారత జట్టు పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. మేము ఈ మ్యాచ్ లో ధైర్యంగా లేము అని అన్నాడు. అయితే ఈ వ్యాఖ్యలు తనని అసహనానికి గురి చేసాయి అని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. దాని పై కపిల్ దేవ్ స్పందిస్తూ.. విరాట్ కోహ్లీ వంటి ఆటగాడు ఇలాంటి ప్రకటనలు చేయకూడదని… ఇలాంటి వ్యాఖ్యలు జట్టు స్ఫూర్తిని పెంచడంలో సహాయపడవని అన్నారు. ఓ కెప్టెన్ స్వయంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మిగితా ఆటగాళ్లు.. ముఖ్యంగా యువ ఆటగాళ్లు ఏ విధంగా ఆలోచిస్తారు అనేది గుర్తుంచుకోవాలి. ఓ కెప్టెన్ జట్టులో స్ఫూర్తిని నింపాలి కానీ… ఇలాంటి వ్యాఖ్యలతో దింపకూడదు అని చెప్పారు.