విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన బాబర్ ఆజమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఓ రికార్డును పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బద్దలు కొట్టాడు. శుక్రవారం ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 51 పరుగులు చేసిన అతడు అంతర్జాతీయ టీ20ల్లో ఓవరాల్‌గా వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. బాబర్ ఆడిన 26వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం. గతంలో విరాట్ కోహ్లీ 30 ఇన్నింగ్సుల్లో వెయ్యి పరుగులు సాధించి రికార్డు సృష్టించగా.. ఇప్పుడు బాబర్ ఆ రికార్డును అధిగమించాడు.
Read Also: బంగ్లాదేశ్‌ను 3 పరుగుల తేడాతో ఓడించిన వెస్టిండీస్
Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
మరోవైపు ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ కూడా ఓ ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. గతంలో శ్రీలంక మాజీ బౌలర్ లసిత్ మలింగ 76 ఇన్నింగ్సులు ఆడి 100 వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్ 53 ఇన్నింగ్సుల్లోనే 100 వికెట్ల ఘనతను అందుకున్నాడు. కాగా గ్రూప్-2లో పాకిస్థాన్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఆ టీమ్ అన్నింటిలో విజయకేతనం ఎగురవేసి ఆరు పాయింట్లను సాధించింది. రెండో స్థానంలో ఆప్ఘనిస్తాన్ జట్టు ఉంది. ఇదే గ్రూప్‌లో ఉన్న టీమిండియా ఇప్పటివరకు పాయింట్ల ఖాతా తెరవలేదు. మన జట్టు ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడగా అందులో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆదివారం టీమిండియాకు కీలక మ్యాచ్ జరగనుంది. బలమైన న్యూజిలాండ్ జట్టును కోహ్లీ సేన ఢీకొట్టనుంది.
తాజావార్తలు
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
-
AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ!
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!