గత ఆదివారం భారత్ , పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత కోహ్లీ చేసిన కొన్ని వ్యాఖ్యలతో నేను నిరాశ చెందాను అని భారత ఆటగాడు అజయ్ జడేజా అన్నాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ లో మేము మొదట్లోనే రెండు వికెట్లు కోల్పోవడం తమను వెనక్కి లాగింది అని చెప్పాడు. అయితే, ఈ వ్యాఖ్యలు నన్ను నిరాశపర్చాయి. మిడిల్ ఆర్డర్ లో కోహ్లీ లాంటి ఆటగాడు ఉన్నపుడు ఆ జట్టు ఎలా వెనకబడుతుంది అని జడేజా అన్నాడు. ఆ రెండు వికెట్లు కోల్పోయే సమయానికి కనీసం రెండు బంతులను కూడా ఎదుర్కోని కోహ్లీ.. అప్పుడే అలా ఆలోచించడం భారత జట్టు ఈ మ్యాచ్ కోసం ఎలా సిద్ధమైంది అనేది తెలుపుతుంది అని చెప్పాడు. అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీ అర్ధ శతకం చేసిన ఫలితం లేకుండా పోయింది. పాకిస్థాన్ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా విజయం సాధించింది.