చలికాలంలో ఎవరికైనా వేడివేడి నీళ్లతో స్నానం చేయాలని ఉంటుంది. చన్నీళ్లతో స్నానం చేయాలంటే చలికి తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. అయితే, కొంతమంది ఎంత చలిగా ఉన్నా చన్నీళ్లతోనే స్నానం చేసేందుకు ఆసక్తి చూపుతారు. ఎంత చలిగా ఉన్నా చన్నీళ్లవైపే మొగ్గు చూపుతారు. ఇటీవలే సోషల్ మీడియాలో ఓ వీడియో ట్రెండ్ అయింది. ఓ చిన్న పిల్లవాడు పొయ్యి వెలిగించి దానిపై పెద్ద మూకుడు పెట్టి అందులో నీళ్లు పోసి దాంట్లోనే కూర్చొని వేడి వేడిగా స్నానం చేశాడు. ఆ వీడియో సొషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఇలాంటిదే మరో వీడియో వైరల్ అవుతున్నది. ఓ వ్యక్తి చెరువులోకి దిగి చన్నీళ్లతో స్నానం చేస్తున్నాడు. అలా స్నానం చేస్తూ చలి నుంచి తప్పించుకునేందుకు వెరైటీగా ఆలోచించాడు.
Read: వాటిపై ఆంక్షలు మళ్లీ పొడిగింపు…
తన ముందు ఓ పెద్ద ప్లేటు ఉంచి అందులో చలిమంట వేశాడు. ఆ మంట నుంచి వచ్చే వేడితో చలి కాసుకుంటూ చన్నీళ్లతో స్నానం చేశాడు. ఫన్నీగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వాట్ యాన్ ఐడియా అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇలా ఇంతవరకు ఎవరూ స్నానం చేయలేదని, అతని ట్రిక్‌ను చూసి చలిసైతం షాక్ అవుతుందని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి