మనిషిని అనుకరించడంలో చింపాంజీలు ముందు వరసలో ఉంటాయి. మనుషులు ఎలాంటి పనులు చేస్తే వాటిని అనుసరించి చింపాంజీలు పనులు చేస్తాయి. ఒక్కోసారి మనుషులను మించి చింపాంజీలు ప్రవర్తిస్తుంటాయి. దుస్తులు ఉతకడం కావొచ్చు బొమ్మలు వేయడం కావొచ్చు… ఎవైనా సరే మనుషులను అనుకరించి చేస్తుంటాయి. అయితే, ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లోని ఓ జూను ఇటీవలే పునఃప్రారంభించారు. అయితే, ఈ జూలో చింపాంజీలకు అక్కడి అధికారులు వెరైటీగా ట్రైనింగ్ ఇచ్చారు. మనుషులు ఎలాగైతే సిగరేట్ తాగుతారో ఆ విధంగా సిగరేట్ తాగేలా ట్రైనింగ్ ఇచ్చారు.
Read: నేషనల్ ఐఏఎస్ అకాడమీలో కరోనా కలకలం- 84 మందికి పాజిటీవ్…
ఈ జూలో డల్లేగా పిలిచే ఓ చింపాంజీ అచ్చం మనుషుల మాదిరిగానే గుప్పు గుప్పుమంటూ సిగార్ కాలుస్తూ ఆకట్టుకుంటున్నది. ఈ చింపాంజీ రోజుకు సుమారు 40 సిగరేట్లు కాలుస్తుందట. లైటర్ తో స్టైల్ గా సిగరేట్ కాలుస్తూ అందర్ని ఆశ్చర్యపరుస్తుంది ఈ డల్లె చింపాంజి. అంతేకాదు, ఈ జూలో చింపాంజీలతో పాటు బాస్కెట్ బాల్ ఆడే కోతులు, కుక్కలు తదితర జంతువులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.