సముద్ర తీరంలో ఉండే ఇసుక ఎప్పుడూ తడిగా ఉంటుంది. లేదా తీరం నుంచి దూరంగా వెళ్తే అక్కడి ఇసుక పొడిగా ఉంటుంది. రాతి శిలలు శిల్పాల్లా మారడం చూశాం. కానీ ఎక్కడైనా ఇసుక శిల్పాల్లా మారడం చూశారా అంటే లేదని చెప్తాం. ఇసుకతో ఏర్పడిన శిల్పాలను చూడాలంటే అమెరికాలోని లేక్ మిషిగన్ తీర ప్రాంతానికి వెళ్లాలి. లేక్ మిషిగన్ సముద్ర తీర ప్రాంతంలో ఇసుకతో సహజంగా ఏర్పడిన శిల్పాలు ఆకట్టుకుంటున్నాయి. ఇలా ఎలా ఏర్పడ్డాయి… ఎవరైనా నిర్మించారా అంటే కాదని చెప్తున్నారు. లేక్ మిషిగన్ ప్రాంతంలో చలికాలంలో నీళ్లు గడ్డకట్టేంతగా ఉష్ణ్రోగ్రతలు పడిపోతాయి. ఆ సమయంలో సముద్ర తీరంలోని నీళ్లు ఇసుకలో చేరి అక్కడ గడ్డకట్టాయి. సముద్రంలోని అలలకు ఇసుక కోతకు గురికావడం, దానికి గాలి తోడవ్వడంతో వివిధ రకాల ఆకృతులుగా ఇసుక మారిపోయింది. లేక్ మిషిగన్ ప్రాంతంలో ఏర్పడిన ఈ శిల్పాలను చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు అక్కడికి వస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Read: తగ్గేదిలే: మనిషికి ఏమాత్రం తీసిపోనంటున్న చింపాంజీ…