దెయ్యాలు ఉన్నాయా లేవా అంటే దేవుడ్ని నమ్మేవారు ఉన్నాయని, నాస్తికులు లేవని చెబుతుంటారు. దెయ్యాలు ఉన్నాయని చెప్పడానికి అనేక మంది అనేక పరిశోధనలు చేశారు. కొంత మంది వివిధ కోణాల్లో నిరూపించారు కూడా. ఈ నిరూపణలో అశాస్త్రీయత ఉందని చాలా మంది కొట్టిపారేస్తుంటారు. దెయ్యాలు ఉన్నాయని బలంగా నమ్ముతున్నానని, వాటిని స్వయంగా తరిమికొట్టానని చెబుతున్నాడు ఐఐటి మండీ డైరెక్టర్, ప్రొఫెసర్ లక్ష్మీధర్. 1993లో చెన్నైలో ఉండగా తన స్నేహితుడి కుటుంబాన్ని దెయ్యాలు పీడించాయని, తాను స్నేహితుడి ఇంటికి వెళ్లి హరేరామ హరేకృష్ణ మంత్రంతో పాటు భగవద్గీత లోని కొన్ని శ్లోకాలు చదివానని, వెంటనే ఆ దెయ్యాలు స్నేహితుడి కుటుంబాన్ని వదిలి వెళ్లాయని చెప్పుకొచ్చారు ప్రొఫెసర్.
Read: విద్యార్థులకు అలర్ట్.. ఈనెల 30 వరకు అన్ని పరీక్షలు వాయిదా
దుష్టాత్మలు వారిలోకి ప్రవేశించినపుడు వారు వింతగా ప్రవర్తించారని ప్రొఫెసర్ చెప్పుకొచ్చారు. ఐఐటి ఢిల్లీ నుంచి పీహెచ్‌డీ చేయడమే కాకుండా రోబోటిక్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విభాగంలో పేరుగాంచిన ప్రొఫెసర్ లక్ష్మీధర్ ఇలా దెయ్యాల గురించి మాట్లాడడంతో ఆసక్తి నెలకొన్నది.