సాధారణంగా చిత్ర పరిశ్రమ అంటే ఎన్నో అవమానాలతో కూడుకొని ఉన్నది. మీడియా ముందు స్టార్లు కోప్పడినా న్యూస్ యే అవుతుంది. స్పందించకపోయినా న్యూస్ యే అవుతుంది. ఇక కొన్నిసారులు జర్నలిస్టులు అడిగే కొన్ని ప్రశ్నలు స్టార్ల మనోభావాలను దెబ్బతీసేలా ఉంటాయి. ఎంతోమంది నటీనటులు ఎదుర్కొని ఉంటారు. తాజగా ఇలాంటి ఒక చేదు అనుభవమే హీరోయిన్ నేహశెట్టికి ఎదురైంది. సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు. ఈ సినిమా ట్రైలర్ ని నేడు రిలీజ్ చేసిన సందర్భంగా మేకర్స్ మీడియాతో ముచ్చటించారు. రిపోర్టుల ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే ఒక రిపోర్టర్ హీరో సిద్దు ను ఒక వల్గర్ ప్రశ్న అడగడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ట్రైలర్ లో హీరో.. హీరోయిన్ న్నీ నీ ఒంటిపై ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయని అడగగా.. ఆమె 16 అని చెప్తోంది. ఇక ఈ డైలాగ్ ని గుర్తుచేస్తూ ‘ హీరోయిన్ ఒంటిపై 16 పుట్టుమచ్చలు రియల్ గా చూశారా..? అని అడిగాడు. దీంతో కంగుతిన్న సిద్దు ఈ ప్రశ్నను వదిలేయండి అంటూ అనడంతో ఆ టాపిక్ ముగిసింది. అయితే ఆ మాటలకూ హీరోయిన్ నేహాశెట్టి ఫీల్ అయ్యింది. తన బాధను ట్విట్టర్ ద్వారా తెలిపింది. ‘ ఈరోజు జరిగిన ట్రైలర్ లాంచ్ లో ఈ ప్రశ్న వినడం చాలా దురదృష్టకరం.. కానీ, సిద్దు సమాధానం చెప్పిన తీరు. ఆయన చుట్టూ ఉండే మహిళల గౌరవ భద్రతలకు సంబంధించి ఆయన స్పందించిన తీరు బాగుంది’ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్పో గా మారింది. దీనిపై పలువురు నెటిజన్లు నేహాకు సపోర్ట్ చేస్తున్నారు. జర్నలిజం అంటే ఇదేనా అంటూ మరికొందరు మీడియాపై దుమ్మెత్తిపోస్తున్నారు.