ప్రస్తుతం చాలా మంది ఆన్లైన్లో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ద్వారా పలు వస్తువులను ఆర్డర్ చేస్తుంటారు. ఈ-కామర్స్ సైట్లో బుక్ చేసే ఆర్డర్ మీకు ఎలా డెలివరీ అవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే చాలా మంది బుక్ చేసే పార్శిళ్లలో వస్తువులు డ్యామేజ్ అయితే డెలివరీ బాయ్స్ కారణమని నిందిస్తుంటారు. కానీ ఆ పార్శిళ్లు ఎక్కడి నుంచి రవాణా అయ్యాయి.. ఎలా రవాణా అయ్యాయన్న విషయాన్ని మాత్రం పట్టించుకోరు. ఈ నేపథ్యంలో పార్శిల్ భద్రత గురించి డెలివరీ…
Viral Video Of Live Reporting: మీడియా రంగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా రంగంలో చాలా మంది జర్నలిస్టులు ఎన్నో సందర్భాల్లో సాహసాలు సైతం చేస్తుంటారు. తాజాగా పాకిస్తాన్లో ఇటీవల కురిసిన వర్షాలకు వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ వరదనీటిలో చిక్కుకున్నాయి. రోడ్లు, రైలు మార్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితిని కవర్ చేసేందుకు వెళ్లిన ఓ పాకిస్తానీ జర్నలిస్ట్ పీకల్లోతు నీటిలో వరదలో…
తమిళనాడులోని కొట్టాయం మీనాచిల్ వద్ద ఆగి ఉన్న ఆటోను కారు వేగంగా ఢీకొంది. అదృష్టవశాత్తు వేగంగా వెళ్తున్న రెండు వాహనాల మధ్య నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ సురక్షితంగా బయటపడింది.
బాపట్ల జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో బెల్ట్ షాపు నిర్వహణ, నాటుసారా అమ్మకాలకు వేలంపాట నిర్వహించారు. అయితే గ్రామంలోని అధికారులు ఈ వేలంపాట నిర్వహించిన విధానం ఇప్పుడు విమర్శల పాలవుతోంది. గ్రామంలోని ఓ ఆలయంలో వేలంపాట నిర్వహించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. లిక్కర్ షాపు కోసం ఆలయంలో వేలం పాట నిర్వహించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆలయంలో లిక్కర్ షాపు కోసం వేలం పాట పెట్టి ఓ వర్గాన్ని అవమానపరిచారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ వేలం పాటలో…
సముద్రంలో అనేక కారణాల వల్ల ఓడలు, పడవలు మునిగిపోతుంటాయి. కొన్ని సార్లు సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల, సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల ఎన్నో సార్లు మునిగిపోతుంటాయి. తాజాగా వాతావరణ కారణాల వల్ల ఓ భారీ నౌక సముద్రంలో మునిగిపోయింది.
National Anthem: పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రముఖులందరూ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ గుల్ షహీద్ పార్క్ వద్ద కూడా పతాకావిష్కరణ చేయగా సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ఎస్టీ హసన్ ఈ వేడుకకు హాజరయ్యారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం ఎంపీ హసన్ బిగ్గరగా జనగణమన పాడుతూ అందరిలోనూ దేశభక్తి రేకెత్తించేందుకు ప్రయత్నించారు. రెండు లైన్లు పాడాడో లేదో తర్వాత లైన్స్ రాలేదు. దీంతో…
Har Ghar Tiranga: ప్రస్తుతం దేశవ్యాప్తంగా 75ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నడుస్తోంది. ఈ మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. దీంతో అందరూ తమ దేశభక్తిని చాటుకునేందుకు ఇళ్లపై జాతీయ జెండాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఓ వ్యక్తి తన ఇంటిపై జాతీయ జెండా కడుతూ విగతజీవిగా మారాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
Shocking snake Video: పాము పేరు వింటేనే చాలా మంది భయపడిపోతారు. అదే పాము నిజంగా కళ్లకు కనిపిస్తే షేక్ అవ్వాల్సిందే. అయితే కర్ణాటకలో ఒళ్లు గగుర్పాటు కలిగించే సీన్ చోటుచేసుకుంది. ఓ బాలుడు యథావిధిగా ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా మెట్లపై నుంచి దిగుతూ తెలియక పాముపై కాలేశాడు. వెంటనే తల్లి స్పందించి క్షణాల్లో అతడిని పక్కకు లాగేయడంతో ప్రాణప్రమాదం తప్పింది. స్థానికంగా ఉన్న సీసీటీవీలో రికార్డు అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం…
Smoking in Airplane: రూల్స్ ప్రకారం.. విమానంలో ప్రయాణించేటప్పుడు అగ్గిపెట్టెలు, లైటర్లు తీసుకెళ్లకూడదు. సహజంగా ప్రి-బోర్డింగ్ సెక్యూరిటీ తనిఖీల్లోనే ఇలాంటివాటిని గుర్తిస్తారు. కానీ ఏం జరిగిందో తెలియదు. బల్విందర్ కటారియా అనే బాడీబిల్డర్ విమానంలో ప్రయాణిస్తూ సిగరెట్ తాగిన
Constable Crying: యూపీలోని ఫిరోజాబాద్‌లో ఓ కానిస్టేబుల్ చేతిలో భోజనం పళ్లెం పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రోజుకు 12 గంటలు పని చేయించుకుంటూ నాసిరకం భోజనం పెడుతున్నారని కానిస్టేబుల్ మనోజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. రెండు రోజులుగా ఆకలితో ఉన్నానని, అధికారులు పట్టించుకోవట్లేదని అతడు వాపోయాడు. జంతువులు కూడా ఇలాంటి ఆహారాన్ని తినలేవని, అలాంటి రొట్టెలు తమకు ఇస్తున్నారని ఎక్కి ఎక్కి ఏడ్చాడు. ఇంటికి దూరంగా…