కోతి పనులు కొన్నిసార్లు నవ్వు పుట్టిస్తాయి.. కొన్నిసార్లైతే వణుకుపుట్టిస్తాయి.. కోపంతో అవి ఎటాక్ చేశాయంటే.. ఇక అంతే సంగతులు.. అందుకే చాలా మంది కోతులు వస్తున్నాయంటేనే దూరంగా వెళ్లే ప్రయత్నం చేస్తుంటారు.. తాజాగా, ఓ కోతి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో కొన్ని కోతులు మద్యానికి అలవాటు పడ్డాయి.. ఎవరూ ఊహించని పని చేస్తున్నాయి. మద్యం దుకాణంలోకి దూరి.. అందులో మద్యాన్ని ఎత్తుకెళ్లడం.. లేదా తాగేయడం చేస్తున్నాయట.. ఇక, ఓ కోతి బీర్ డబ్బాను సిప్ చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.. కోతులు తమ వైన్స్ నుంచి మద్యం ఎత్తుకెళ్లిపోతున్నాయంటూ ఆ షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు..
Read Also: Janasena Social Audit: జనసేన సోషల్ ఆడిట్.. కొత్త తరహాలో వాస్తవాలు వెలికితీస్తాం..!
అంతేకాదు, మద్యం తాగుతూ ఎవరైనా కనిపించినా కష్టమే నట.. ఎందుకంటే.. వారి దగ్గర ఉన్న బాటిళ్లను కూడా అలా ఎత్తుకెళ్లిపోతున్నాయట కోతులు.. అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. ఎదురు తిరిగి దాడి కూడా చేస్తున్నాయట.. దీంతో, మద్యం విక్రేతలు కోతి అంటే భయంతో వణికిపోతున్నారట.. మద్యం తాగేవాళ్లు కూడా కోతులను చూస్తే పరుగులు తీస్తున్నారట.. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. అటవీ శాఖ అధికారులతో కలిసి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.. మొత్తానికి ఈ తాగుబోతి వానరం… చుక్కేస్తూ.. అక్కడి వారికి చుక్కలు చూపిస్తోంది. అయితే, ఎన్ని షాపుల్లో కోతులు దూరాయి.. ఎంత మద్యం ఎత్తుకెళ్లాయనే వివరాలు లేవు కానీ.. బీర్ టిన్ నుంచి బీర్ లాగిస్తున్న ఓ కోతి వీడియో మాత్రం తెగ వైరల్‌గా మారిపోయింది.