Hair Cutting: ప్రస్తుతం యువత ట్రెండ్‌ను ఎక్కువగా ఫాలో అవుతోంది. ఈ నేపథ్యంలో ఫైర్ హెయిర్ కట్ అనేది ఇటీవల ఫ్యాషన్‌గా మారింది. ఫైర్ హెయిర్ కట్ అంటే జుట్టుకు నిప్పంటించి హెయిర్ సెట్ చేసి కత్తిరిస్తారు. దీంతో ఓ యువకుడు ఫైర్ హెయిర్ కట్ చేయించుకుందామని భావించాడు. అయితే వెరైటీకి పోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. తలకు నిప్పు అంటుకుని గాయాలపాలైన ఆ యువకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలోని వాపిలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: High Court: అక్కినేని నాగార్జునకు ఏపీ హైకోర్టు నోటీసులు.. కారణం ఇదే..!!
వివరాల్లోకి వెళ్తే.. వల్సాద్ జిల్లాలోని వాపిలో 18 ఏళ్ల కుర్రాడు హెయిర్ కటింగ్ కోసం స్థానికంగా ఉండే సెలూన్‌కు వెళ్లాడు. సదరు సెలూన్‌లో పనిచేసే వ్యక్తి అతడికి ‘ఫైర్ హెయిర్ కట్’ పద్ధతిలో హెయిర్ కట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడి తలపై ఒక కెమికల్ అప్లై చేసి ఆ తర్వాత ఫైర్ అంటించబోయాడు. నిజానికి ఆ మంట జుట్టుకు మాత్రమే అంటుకోవాలి. కానీ యువకుడి తలంతా మంటలు అంటుకున్నాయి. ముఖం, మెడపై కూడా మంటలు వ్యాపించాయి. దీంతో బాధితుడు భయంతో పరుగులు తీశాడు. కటింగ్ చేస్తున్న వ్యక్తి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ ఘటనలో బాధితుడి తల, ముఖం, మెడపై గాయాలయ్యాయి. వెంటనే యువకుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. యువకుడి ఫైర్ హెయిర్ కట్ కోసం వాడిన కెమికల్స్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
An 18-year-old man suffered severe burn injuries after his ”fire haircut” went wrong at a salon in Vapi town of Gujarat’s Valsad district#valsad #fire_haircut #ViralVideo #viralvideos2022 pic.twitter.com/K4ALzdGyq5
— Ravi kumar (@ravikumar455) October 27, 2022