Toyota Fortuner car stolen at gunpoint: నడిరోడ్డుపై గన్ పాయింట్ లో ఓ వ్యక్తి తన టయోటా ఫార్చ్యూనర్ కారును కోల్పోయాడు. దొంగతనానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు కారు యజమానికి గన్ గురిపెట్టి కారును ఎత్తుకెళ్లారు. నైరుతి ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలో గన్ గురిపెట్టి 35 ఏళ్ల వ్యక్తి నుంచి కారును దొంగిలించారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. శనివారం తెల్లవారుజామున 2.19 గంటలకు ఢిల్లీ కంటోన్మెంట్…
Hair Cutting: ప్రస్తుతం యువత ట్రెండ్‌ను ఎక్కువగా ఫాలో అవుతోంది. ఈ నేపథ్యంలో ఫైర్ హెయిర్ కట్ అనేది ఇటీవల ఫ్యాషన్‌గా మారింది. ఫైర్ హెయిర్ కట్ అంటే జుట్టుకు నిప్పంటించి హెయిర్ సెట్ చేసి కత్తిరిస్తారు. దీంతో ఓ యువకుడు ఫైర్ హెయిర్ కట్ చేయించుకుందామని భావించాడు. అయితే వెరైటీకి పోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. తలకు నిప్పు అంటుకుని గాయాలపాలైన ఆ యువకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన గుజరాత్‌లోని వల్సాద్…
భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపాల్సింది పోయి దానిని వీడియో తీశాడు ఓ భర్త. యూపీలోని కాన్పూర్‌లో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్త సంజయ్ వీడియో తీయడం గమనించి తన ప్రయత్నం విరమించి. బయటకొచ్చిన శోభితా గుప్తా.. మళ్లీ భర్తతో గొడవ జరగడంతో ఉరి వేసుకుని చనిపోయింది.
ఓ సినీ నిర్మాత తాను వేరే మహిళతో ఉండటాన్ని గుర్తించిన భార్యను కారుతో ఢీకొట్టాడు. సినీ నిర్మాత కమల్ కిషోర్ మిశ్రా వాహనంలో మరో మహిళతో ఉండటాన్ని గమనించిన తన భార్యపైకి తన కారును ఎక్కించపోయాడనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
మందుబాబులం మేం మందుబాబులం అంటే చాలు గబ్బర్ సింగ్ మూవీ గుర్తుకు రావాల్సిందే అందులో కోటా శ్రీనివాస్ రావు పోలీస్టేషన్ లో చేసే హడావుడి ప్రేక్షకులకు ఆకట్టుకుంది. తాగుబోతులంటే ఎందుకంత చులకన అంటూ వేసే స్టేప్పులతో ఆసాంగ్ కు సినిమా హాల్ లో విజల్స్ తో దద్దరిల్లింది.
సాధారణంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు డబ్బులు కనిపిస్తే.. మరో ఆలోచన లేకుండా తీసుకుని మెల్లగా అక్కడ నుంచి వెళ్లిపోతుంటారు. అలాంటిది డబ్బుల వర్షం కురిస్తే ఎవరైనా ఊరుకుంటారా?. అలాంటి ఘటనే చిలీ దేశంలో జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ కుటుంబం డెంగ్యూ రోగికి ప్లాస్మాకు బదులుగా బత్తాయి జ్యూస్‌ను స్థానిక బ్లడ్ బ్యాంక్ సరఫరా చేసిందని ఆరోపించింది. దీనిపై విచారణ కూడా జరుగుతున్నట్లు తెలిపింది.
కంటి చూపు తక్కువగా ఉన్నవారు ఎక్కువగా అద్దాలు ధరిస్తారు. కానీ కొంతమంది తమ ముఖాన్ని అందవిహీనంగా మార్చుకోకుండా కళ్లలో కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకుంటారు. వీటిని ధరించడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందని చెబుతారు.
ప్రయాగ్‌రాజ్‌లోని ఫుల్పూర్ ప్రాంతం నుండి ఒక పోలీసు ఇన్స్పెక్టర్ అర్ధరాత్రి పాన్ షాప్ నుండి లైట్ బల్బును దొంగిలిస్తున్నట్లు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చోరీ అక్టోబర్ 6న జరిగినట్లు సీసీటీవీలో రికార్డయింది.