New Idea: భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడటం సాధారణ విషయమే. వర్షం వస్తే ఇంటా, బయట ఏ పని పూర్తి కాదు. వర్షాలు, తుఫాన్లు వస్తున్నా అత్యవసర రంగాలకు చెందిన ఉద్యోగులు పలు జాగ్రత్తలతో పనిచేయాల్సి ఉంటుంది. తుఫాన్ కారణంగా అమెరికాలోని ఫ్లోరిడా నగరం అల్లకల్లోలంగా మారింది. నాలుగు రోజులుగా ఫ్లోరిడాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా జోరు వానలో, భీకర గాలిలోనూ అక్కడి పరిస్థితులను వివరించేందుకు కైలా అనే మహిళా రిపోర్టర్…
Navaratri Special: సాధారణంగా ఏదైనా ఆలయానికి వెళ్తే భక్తులు ఆలయం బయటే చెప్పులు విడిచి లోపలకు వెళ్తారు. ఇది సంప్రదాయం కూడా. అలాంటిది దేవుడికి చెప్పులు సమర్పించడం ఎక్కడైనా చూస్తామా.. కానీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మాత్రం ఈ సన్నివేశం కనిపిస్తుంది. భోపాల్‌లోని కోలా ప్రాంతంలో జిజిబాయ్ ఆలయం, పహడావాలీ మాతా ఆలయానికి వెళ్లే భక్తులు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి చెప్పులు, షూలు సమర్పించి తమ కష్టాలు చెప్పుకుంటారు. దీనికి ఓ కారణముందని అక్కడి స్థానికులు వివరిస్తున్నారు.…
సాధారణంగా వీకెండ్ సెలవులు వస్తే ఎవరైనా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తారు. దీనికి చిన్నా, పెద్ద అనే తేడా ఉండదు. అయితే ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు మాత్రం వీకెండ్ సెలవులలో ఇంట్లో సేదతీరకుండా పొలం వైపు అడుగులు వేశారు. ఏపీలోని బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఇద్దరూ తమ భార్యాపిల్లలతో కలిసి పొలంలో చెమట చిందించారు. రైతులతో పాటు వీళ్లు కూడా పొలంలో పనిచేశారు. ఈ సందర్భంగా బాపట్ల మండలం…
Bharatiya Janata Party: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ బీజేపీ నేత చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. గుణ జిల్లా చక్‌దేవ్‌పూర్ గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల బాలికలతో మరుగుదొడ్లను శుభ్రం చేయించారని వార్తలు రావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విచారణకు కూడా ఆదేశించారు. బాలికలతో మరుగుదొడ్లను కడిగించిన పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు. అయితే ఈ నేపథ్యంలో సేవా పఖ్వాడ…
Eating Banana: పండ్లలో అరటిపండు ఎంతో చౌకగా లభిస్తుంది. అరటిపండు జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. కానీ ప్రస్తుతం అరటిపండ్ల గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అరటిపండ్లు తింటే చనిపోతారనే న్యూస్ తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. సోమాలియా నుంచి ఇటీవల భారత్‌కు పెద్ద ఎత్తున అరటిపండ్లు దిగుమతి అయ్యాయని.. వీటిని తింటే 12 గంటల్లో చనిపోతారని ప్రచారం జరగుతుండటం పలువురిని షాక్‌కు…
Death Certificate: ఎవరైనా తమ స్టడీ సర్టిఫికెట్లు పోయాయని లేదా విలువైన ఆస్తి పత్రాలు పోయాయని పేపర్లో ప్రకటన ఇస్తుంటారు. కానీ డెత్ సర్టిఫికెట్ పోయిందని ఎవరైనా ప్రకటన ఇస్తారా.. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన డెత్ సర్టిఫికెట్ పోయిందని ఓ వ్యక్తి పేపర్లో ప్రకటన ఇవ్వడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. ఒక వ్యక్తి ‘నా డెత్ సర్టిఫికెట్ పోయింది.. సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో తన మరణ ధృవీకరణ…
Mumbai: నవీముంబై.. అర్ధరాత్రి.. అందరు కునుకులోకి జారుకున్నారు.. నిశబ్దంగా ఉన్న రోడ్లపై గాలికి ఊగుతున్న ఆకుల సౌండ్ తప్ప ఏమి వినిపించడం లేదు. ఆ సమయంలో నిద్రపట్టక బాల్కనీలోకి వచ్చాడు ఒక స్థానికుడు.. చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తూ ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు.