Elephant Enjoying Panipuri: పానీపూరి చాలా మంది ఇష్టంగా తింటారు. పానీపూరి బండి కనిపిస్తే చాలు తినకుండా అక్కడ నుంచి రాలేరు. పానీపూరీ అంటే మన చాలా మందికే కాదు.. ఈ గజరాజుకు కూడా మహా మక్కువేనేమో.. పానీపూరి బండివాడు చక్కగా సర్వ్ చేస్తుంటే.. చకాచకా నోట్లో వేసుకుని ఎంజాయ్ చేస్తోంది. అస్సాం తేజ్‌పూర్‌లో ఈ దృశ్యాలను చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఏనుగు పానీపూరీ తింటూ ఎంజాయ్ చేస్తున్న ఈ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన అస్సాంలోని తేజ్‌పూర్‌లో చోటుచేసుకుంది. మావటితో వస్తున్న ఏనుగు పానీ పూరీ స్టాల్ వద్ద ఆగింది. పానీ పూరీని అమ్మకందారుడు ఒక్కొక్కటిగా ఇచ్చిన తర్వాత లొట్టలోసుకుంటూ తింటున్నట్టు కనిపించింది. ఆ ఏనుగు పానీ పూరీలు తినిపించినందుకుగానూ అతను చాలా సంతోషించాడు. ఏనుగు పానీ పూరీ రుచిని ఆస్వాదించింది. అక్కడికక్కడే ఉన్న వ్యక్తులు తమ మొబైల్ కెమెరాల ద్వారా ఆ వీడియోను చిత్రీకరించారు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.