Pulasa Price: గోదావరి పులసలకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గోదావరిలో దొరికే పులసలను పుస్తెలను విక్రయించైనా సరే తినాలనే నానుడి ఉంది. లైవ్ పులస దొరికితే ఇంకా ఊరుకుంటారా చెప్పండి. ఈ నేపథ్యంలో ఓ పులస ప్రియుడు లైవ్ పులస దొరకడంతో సోమవారం భారీ రేటుకు కొనుగోలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పులస దొరకడమే గగనమనుకుంటుంటే లైవ్ పులస దొరకడంతో జాలరి కూడా సంబరపడ్డాడు. ఎందుకంటే లైవ్ పులస దొరకడం చాలా అరుదు అని మత్స్యకారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కేదారి లంక గోదావరిలో లైవ్ పులస దొరికింది.
Read Also: Rupee Value: రూపాయి మరింత పతనం.. ఒక డాలర్‌కు ఎన్ని రూపాయలంటే..?
మాములుగా పులస వలలో పడగానే పదినిమిషాల్లో చనిపోతుంది. కానీ జాలరి చందాడి సత్యనారాయణకు వలలో పడ్డ పులస లైవ్‌గా దొరికింది. దీంతో తన పంట పండిందని ఆ మత్స్యకారుడు సంతోషం వ్యక్తం చేశాడు. లైవ్‌లో దొరికిన సుమారు కేజీ వున్న గోదావరి పులసను మామిడికుదురు మండలం పెదపట్నంలంక గ్రామానికి చెందిన నల్లి రాంప్రసాద్ అనే పులస ప్రియుడు ఏకంగా రూ.17వేలు పెట్టి కొనుగోలు చేశాడు. ఇదిలా వుంటే సుమారు పది ముక్కలు తెగిన ఈ పులస ఖరీదు అర గ్రాము బంగారంతో సమానంగా ఉందని కొందరు లెక్కలు కడుతున్నారు లెక్క ఎలా ఉన్నా కానీ ముక్క మాత్రం సూపర్ అని లైవ్ పులసను కొనుగోలు చేసిన రాంప్రసాద్ అంటున్నాడు. అందుకేనేమో పుస్తెలు అమ్మి అయినా పులస తినాలన్నారు పెద్దలు. మరి గోదావరి పులసా మజాకా అని నెటిజన్‌లు కామెంట్లు పెడుతున్నారు.