పండుగ అని లవర్‌తో షాపింగ్‌కు వెళ్లాడు ఓ వ్యక్తి. అయితే.. అతడి టైం బాగోలేదేమో తన ప్రియురాలితో వెళ్లిన షాపింగ్ మాల్‌కే వచ్చింది అతడి భార్య. ఇంకేముంది.. ప్రియురాలితో షాపింగ్‌కు వచ్చిన భర్తను పట్టుకొని నడురోడ్డుపై చితబాదింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ప్రీతికి రాహుల్‌కు 2017లో వివాహం జరిగింది. అయితే.. పెళ్లయిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో గత మూడేళ్లుగా ప్రీతి తన తల్లి ఇంట్లోనే ఉంటోంది. వీరిద్దరి మధ్య వివాదానికి సంబంధించిన పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉంది.
తన భర్తకు వేరే మహిళతో సంబంధాలు ఉన్నాయని, తనను తనతో తీసుకెళ్లకుండా ఒంటరిగా జీవిస్తున్నాడని ప్రీతి ఆరోపించింది. అయితే.. గురువారం కర్వా చౌత్ సందర్భంగా రాహుల్ (తన ప్రియురాలితో) ప్రీతి (ఆమె తల్లితో) ఇద్దరూ తురబ్‌నగర్ షాపింగ్‌లో వచ్చారు. అక్కడ ప్రియురాలితో కనిపించిన రాహుల్‌తో పాటు అతడి ప్రియురాలిని ప్రీతి చెంపలు చెల్లుమనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
#पुरुष वर्ग कृपया ध्यान दे..
आज घर वाली पर ही संपूर्ण आस्था केंद्रित रखें. अन्यथा..
गाजियाबाद तुराबनगर मार्केट में करवाचौथ के दिन दूसरी महिला को शॉपिंग करवा रहा था पति. पत्नी ने मार्केट में रंगे हाथों पकड़ा..फिर क्या हुआ विडियो में देखें. pic.twitter.com/M7byodsbCB— Yogesh Tiwari (@yogirishuNBT) October 13, 2022