వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో సేవలందిస్తున్నాయని టీడీడీ ఈవో ధర్మారెడ్డి తెలపారు. సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా జులై 15వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకే పరిమితం చేస్తున్నామని ఆయన చెప్పారు.
తెలంగాణ మహాజాతర మేడారం ప్రారంభం అయింది. మేడారంలో గద్దెల మీద కొలువు తీరనున్నారు సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజులు. ఈ రోజునుంచి 19 వరకూ జాతర జరుగుతుంది. ఈ జాతరకు వెళ్ళాలనుకునేవారికి అద్భుతమయిన అవకాశం లభించింది. హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సేవలు ఇవాళ్టి నుంచి ప్రారంభమై.. 20 వరకు అందుబాటులో ఉంటాయి. జాయ్రైడ్, షటిల్ సర్వీస్, చార్టర్ సర్వీస్ అనే మూడు రకాల హెలికాప్టర్ సేవలను భక్తులు వినియోగించుకోవచ్చు.…