Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. శోభాయాత్రలో జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు, కాకర్ల రంగనాథ్ అనుచరులు పరస్పరం ఎదురెదురయ్యారు. మొదట నినాదాలతో ప్రారంభమైన వాగ్వాదం, తరువాత రాళ్ల దాడిగా మారి రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. అందిన సమాచారం ప్రకారం, ఆసుపత్రిపాలెం వద్ద కాకర్ల రంగనాథ్ వర్గానికి చెందిన వినాయక విగ్రహం నిదానంగా వెళ్తుండటంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి వేగంగా తీసుకెళ్లాలని సూచించారు. దీనిపై ఆగ్రహించిన రంగనాథ్, ప్రభాకర్‌రెడ్డిని…
భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతోందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్‌లో ఉన్న విగ్రహాలు త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నామన్నారు. గత ఏడాది లాగా ఆలస్యం కాకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మండప నిర్వాహకులతో మాట్లాడి నిమజ్జనం జరిగేలా చూస్తున్నామన్నారు. బాలాపూర్ వినాయకుడు కూడా త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నామని చెప్పారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రణాళికలు సిద్ధం…
హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజుల పాటు వైన్స్ షాప్స్ బంద్ చేస్తున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్ లో రెండు రోజుల పాటు వైన్స్ షాపులు మూతపడనున్నాయి. సెప్టెంబర్ 28, 29వ తేదీల్లో వైన్స్ షాపులు బంద్ చేస్తున్నాట్లు ప్రకటించారు.
వినాయక నిమజ్జనంపై తమకు వివరాలు సమర్పించాలని మరోసారి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిమజ్జనం సందర్భంగా జనం భారీగా గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకుంటారు… రసాయనాలతోకూడిన విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకుండా చర్యలేమిటి అని ప్రశ్నించింది. ఇక సెప్టెంబరు 1లోగా నివేదికలు సమర్పించాలని జీహెచ్ఎంసీ, హైదరాబాద్ సీపీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నివేదిక సమర్పించకపోతే సీనియర్ అధికారులు హాజరు కావాలని హైకోర్టు పేర్కొంది. హుస్సేన్ సాగర్ లో గణేష్, దుర్గ విగ్రహాల…