Rare Earth Magnets: రేర్-ఎర్త్ అయస్కాంతాలపై చైనా గుత్యాధిపత్యం, చైనా ఆంక్షలను అరికట్టడానికి ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ మరియు రక్షణ పరికరాల్లో కీలకమైన రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాలు(REPMలు) తయారీని ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రివర్గం ఒక కొత్త పథకాన్ని ఆమోదించింది.
PM Modi: యూకే ప్రధాని కీర్ స్టార్మర్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మోడీ, ఖలిస్తానీ తీవ్రవాదాన్ని యూకే ప్రధాని ముందు లేవనెత్తినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ‘‘రాడికలిజం, హింసాత్మక తీవ్రవాదానికి ప్రజాస్వామ్య సమాజాలలో స్థానం లేదని, సమాజాలు అందించిన స్వేచ్ఛలను ఉపయోగించడానికి లేదా దుర్వినియోగం చేయడానికి అనుమతించరాదని ప్రధాన మంత్రి మోదీ నొక్కి చెప్పారు. రెండు వైపులా అందుబాటులో ఉన్న చ
UK PM: భారత ఆర్థిక వ్యవస్థ 2028 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. భారత్ ఈ స్థాయికి చేరుకునే మార్గంలో ఉందని ఆయన అన్నారు. యూకే ప్రధాని వ్యాఖ్యలు, ట్రంప్ ‘‘డెడ్ ఎకానమీ’’ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఉన్నాయి. భారత్ ఇటీవలే జపాన్‌ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.
Kishan Reddy: కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని టీ-హబ్‌లో నిర్వహించిన నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (NCMM) ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ సెమినార్‌లో కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ప్రసంగించారు. పరిశోధనలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు హైదరాబాద్ అనువైన నగరమని.. ఇది సృజనాత్మకతకు, శాస్త్ర, సాంకేతిక రంగాలకు హబ్ లాంటిదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు, ఉత్పత్తుల సరఫరాలో ఇబ్బందుల నేపథ్యంలో స్వదేశీ పరిజ్ఞానం యొక్క ప్రాముఖ్యత పెరిగిందని కిషన్ రెడ్డి అన్నారు. 2030 నాటికి EV…
దేశంలో పేదలకు మేలు చేయడమే వికసిత్ భారత్ లక్ష్యం అని బీజేపీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. భారతదేశంలో 80 కోట్ల మందికి రేషన్ అందిస్తున్నామన్నారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం దేశంలో పేదరికం ఐదు శాతం తగ్గిందని పేర్కొన్నారు. ఎన్డీయే కూటమిని ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారో.. దానికి జవాబుదారీతనంగా పరిపాలన ఉందన్నారు. 11 సంవత్సరాల వికసిత భారతదేశపు అమృతకాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి పెద్దపీట అని పురందేశ్వరి చెప్పుకొచ్చారు.…
Daggubati Purandeswari: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మంగళవారం విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి “అమ్మ పేరుతో ఒక మొక్క” కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. ప్రకృతి పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమం ప్రజలందరినీ మొక్కలు నాటేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వివిధ అంశాలపై మాట్లాడారు. Read Also: Google Maps: గూగుల్ మ్యాప్స్ చూస్తూ డ్రైవింగ్.. ఓరి దేవుడా…
అన్ని రంగాలలో మహిళలు చరిత్ర సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సమాజంలో మహిళల స్థితిగతులు మారాలని.. ధైర్యంగా సవాళ్లను ఎదురుకొని మహిళలు ముందుకు అడుగులు వేయాలని సూచించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆది నుంచి మహిళలను గౌరవించే సంప్రదాయం మనదని.. మహిళల అభివృద్ధికి, రక్షణకు మోడీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. భూగర్భం ఖనిజాల వెలికితీత నుంచి వినీలాకాశంలో ఫైలట్ వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అన్ని…
Union Budget 2025: 2025-26 కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో అనేక కీలక ప్రకటనలు చేసారు. ఇందులో ముఖ్యంగా.. మధ్య తరగతి ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ను అందిచారు. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు కల్పించారు నిర్మలా సీతారామన్. అలాగే సీనియర్ సిటిజన్స్కు TDS మినహాయింపు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. అలాగే అప్డేటెడ్ ఇన్కమ్ ట్యాక్స్ నమోదుకు సమయం 4 ఏళ్లకు పొడిగించారు.…