Chandrayaan-3 Mission: అంతా సిద్దం.. చంద్రయాన్ 3 గురించి కీలక అప్డేట్ ఇచ్చిన ఇస్రో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ చంద్రయాన్ 3. విక్రమ్ రోవర్ ఈ రోజు చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టబోతుంది. ఇదే కనుక జరిగే భారత్ అంతరిక్ష పరిశోధనలో ఎలైట్ లిస్ట్ లో చేరుతుంది. అంతేకాకుండా జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి అడుగుపెట్టిన తొలి దేశంగా చరిత్రకెక్కుతుంది. చంద్రయాన్ 3 చందమామపై సక్సెస్ ఫుల్ గా అడుగుపెట్టాలని దేశ వ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రయాన్ 3 కి సంబంధించి కీలక అప్డేట్ ను ఇస్రో ఎక్స్ ( ట్విటర్ ) ద్వారా పంచుకుంది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగడానికి అన్ని అనుకూలంగా ఉందని ఇస్రో పేర్కొంది. ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ ను ప్రారంభించడానికి అన్ని సెట్ అయ్యాయని ఇస్రో తన ట్వీట్ లో తెలిపింది. ల్యాండర్ మాడ్యూల్ తాను చేరుకోవాల్సిన పాయింట్ వద్దకు 17:44గంటలకు చేరుకుంటుందని వెల్లడించింది. ఏఎల్ ఎస్ కమాండ్స్ అందుకున్న తరువాత పవర్ కోసం ఇంధన ఇంజన్లను ల్యాండర్ మాడ్యుల్ యాక్టివేట్ చేస్తుందని తెలిపిన ఇస్రో మిషన్ దగ్గర నుంచి వచ్చే కమాండ్లను ఆపరేషన్ టీమ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపింది. దీనికి సంబంధించిన లైవ్ టెలికాస్ట్ 17:20 గంటలకు ప్రారంభమవుతుందని ఇస్రో ట్విటర్ వేదికగా తెలిపింది. అంతా అనుకున్నట్లుగా సాగితే చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ సాయంత్రం గం.6.04 సమయానికి చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపుతుంది.
Also Read: Pak On Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగంపై పాకిస్తాన్ ప్రశంసలు
Also Read
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
- India-Iran Trade: ఇరాన్‌తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
- Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
ఇక ల్యాండర్ జాబిల్లి పై దిగడానికి అనువుగా లేకపోతే దీనిని ఆగస్టు 27కు వాయిదా వేయవచ్చనే కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే మొత్తానికి ఇస్రో ఈ రోజే విక్రమ్ ల్యాండర్ ను చందమామ దక్షిణ ధ్రువం పై దించనుంది. దీంతో జాబిల్లి సౌత్ పోల్ ను చేరుకున్న తొలి దేశంగా చరిత్ర పుటల్లో నిలవనుంది. దీని కోసం యావత్ భారతదేశంతో పాటు ప్రపంచం కూడా ఎదురు చూస్తుంది. అయితే భారత్ కంటే ముందు ఈ ఘనత సాధించాలని ప్రయత్నించి లూనా 25 కుప్పకూలడంతో రష్యా భంగపాటుకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచం మొత్తం చంద్రయాన్ వైపు చూస్తోంది. ఇస్రోతో పాటు చాలా ఛానల్స్ చంద్రయాన్ 3 ప్రయోగాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఇస్రో కు ఆల్ బెస్ట్ చెబుతూ ట్వీట్ చేస్తున్నారు. ఇస్రో ఈ ఘనత సాధించి కచ్ఛితంగా భారత కీర్తి పతాకాన్ని అంతరిక్ష పరిశోధనల్లో ఎగిరేలా చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులే కాకండా సెలబ్రెటీలు సైతం ఇస్రోకు గుడ్ లక్ చెబుతున్నారు.
తాజావార్తలు
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్‌బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
-
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్‌పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
-
Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!