Tenth Class Student Murder: విద్యార్ధినిపై అత్యాచారం, హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధుల్లో మార్పు రావడం లేదు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం అంగడి చిట్టెంపల్లి గ్రామంలో దారుణం జరిగింది. పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్యకు పాల్పడ్డారు. బాలికపై బండరాయితో మోది హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఉదయం 6 గంటల ప్రాంతంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది మైనర్ బాలిక. కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం బాలికను వివస్త్రను చేసి హత్య, అత్యాచారానికి పాల్పడినట్లు చెబుతున్నారు పోలీసులు.
పూర్తి ఆధారాలు సేకరించిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గ్రామంలో నీటి సమస్య ఉండటం వలన ఇంట్లో నుండి ఇ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ల వరకూ కాలకృత్యాలు తీర్చుకునేందుకు నగర శివారు ఖాళీ ప్రదేశాలకు వస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఖాళీ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ ఆడపిల్లలను వేధిస్తున్నారు ఆకతాయిలు. గతంలో సమస్యకు సంబంధించి అధికారులకు ఎంత చెప్పినా వినిపించుకోలేదన్నారు.
Also Read
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
ఈ ఘటనకు పాల్పడిన ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని మహిళలు అంటున్నారు. ఇంట్లో నుండి ఇ పిల్లలను బయటకు పంపించాలంటే భయం వేస్తోందంటున్నారు. స్కూలుకు వెళ్లేటప్పుడు బెదిరిస్తున్నారని కొంతమంది ఆడపిల్లలు చెబుతున్నారు. దీంతో తమ పిల్లలను బయటకు పంపించాలి అంటే భయమేస్తోందన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. గతంలో బాత్రూంలు, నీటి సమస్య సంబంధించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు వాపోయారు.
వికారాబాద్ ఎస్పీ కోటి రెడ్డి ఏమన్నారంటే…
15 ఏళ్ల మైనర్ బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాం. బాలిక మృతి చెందినట్లు గుర్తించాం. అత్యాచారం చేసి హత్య చేసినట్టు తెలుస్తోంది. మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ హాస్పిటల్ కు తారలించాం. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం.
తాజావార్తలు
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!