అనంతగిరి కొండల్లో ఆగని తుపాకుల మోత…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ అతి సమీపంలో ఉన్న అనంతగిరి కొండల్లో నిత్యం ఏదో ఒక అలజడి కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ తుపాకుల మోత మోగుతూనే వుంటుంది. అనంతగిరి కొండల్లో ఎక్కడో ఒకచోట ప్రతినిత్యం వేటగాళ్లు తుపాకులకు పని చేపు తునే ఉన్నారు. అనంతగిరి కొండలు పర్యాటక కేంద్రం కావడంతో అక్కడ నిత్యం ఏదో ఒక సందడి ఉంటుంది. అయితే కొంత మంది వేటగాళ్లు స్వేచ్ఛగా అక్కడ హంటింగ్ చేస్తున్నారు. దీనిని అరికట్టేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా మరొకసారి వికారాబాద్లోని అనంతగిరి కొండల్లో అర్ధరాత్రి సమయంలో తుపాకుల మోత వినిపించింది.
తుపాకుల మోతలు.. మందుబాబుల ఆగడాలతో అనంతగిరి అడవుల్లో అలజడులతో నిత్యం జనం జంకుతున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి నిత్యం పర్యాటకుల సందడితో కళకళలాడుతూ కనిపిస్తుంది. హైదరాబాద్ నగరానికి అతి దగ్గరగా అనంతగిరి అడవులు, కొండ కొనలు, చెరువులు ఉండడంతో పర్యాటకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ పర్యాటక కేంద్రాన్ని ఆసరాగా చేసుకొని కొంత మంది మందుబాబులు రెచ్చిపోతున్నారు. అడవిలో ఎక్కడ బడితే అక్కడ తాగిపడేసిన సీసాలు…వ్యర్ధ పదార్ధాలతో కనిపిస్తోంది. అనంతగిరి చూట్టూ పదుల సంఖ్యలో రిసార్ట్స్ లు ఉండడంతో వాటిలో రాత్రి బస చేసేందుకు వస్తున్న యాత్రికులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అడవుల్లో పర్యటనకోసం వచ్చే కొంతమంది బడానాయకుల పిల్లలు తమవెంట తూపాకు తీసుకొచ్చి రాత్రి సమయంలో హంటింగ్ (వేట) కోసం అడవుల్లో తిరుగుతూ గన్ లో శబ్దంతో మారుమోగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయాలపై స్థానికులు అటవిశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అటవిశాఖ అధికారులకు పర్యాటకుల నుంచి డబ్బులు వసూళ్లు చేయడంపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలు కల్పించడంలో గాని, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంలో మాత్రం చూపడంలేదని ఇక్కడి పరిస్థితి అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు అడవుల్లో వేసే వ్యర్దాలను తింటు, ఓవర్ స్ఫిడ్ తో వెళ్తున్న వాహనాలు తగిలి నిత్యం వణ్యమృగాలు మృత్యువాత పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని, ఈ అడవి ప్రాంతంలో నుంచి రహదారిలో గ్రామాల ప్రజలు ఎప్పుడూ ఏ ప్రమాదం జరుగుతుందోనని జంకుతున్నారు. గతంలో వికారాబాద్ జిల్లా లో వేట వాళ్ల బారిన పడి ఎన్నో మూగజీవాలు మృత్యు వాతపడిన ఘటనలు ఉన్నాయి. అనంతగిరి అడవుల్లో జరుగుతున్న కార్యకలాపాలపై స్పందించేందుకు అటవిశాఖ, పోలీస్ శాఖ అధికారులు స్పందించేందుకు ఇష్టపడడం లేదు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అనంతగిరిలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Also Read
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
: Ramesh Vaitla
తాజావార్తలు
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!