Drugs: విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి.. డ్రగ్స్ కొరియర్ కేస్ చిక్కు ముడి విడకముందే నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. నిందితుల నుండి 8 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో పక్క ప్లాన్ తో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేశారు కర్నూలు పోలీసులు.. మరో ముగ్గురూ పరారీ అయినట్టుగా చెబుతున్నారు.. ఎనర్జీ బూస్ట్‌లో ఉపయోగించే మెధాంఫిటమైన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు.. కర్నూల్ డ్రగ్స్ విక్రయాలతో విజయవాడ యువకుల సంబంధాలు ఉన్నట్టుగా తేల్చారు.. విద్యార్థులు టార్గెట్‌గా డ్రగ్స్ వ్యవహారం సాగుతున్నట్టుగా.. ఆన్‌లైన్ ద్వారా డ్రగ్స్ వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం… బెంగుళూరు, హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ వ్యవహారం నడుస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు..
Read also: Russia-Ukraine war: పుతిన్‌పై ఆ దేశం నిషేధం.. సెనెట్‌లో బిల్లు..
Also Read
- AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
- Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
- Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
- AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
మరోవైపు, డ్రగ్స్ కొరియర్ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.. మరో ఇద్దరు ప్రధాన నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.. పోలీసు విచారణలో పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. చెన్నైకి చెందిన డ్రగ్స్ ఎగుమతి చేసే కుప్పుసామి అరుణాచలం వెంకటేశన్ మరియు మరో ఇద్దరు నిందితులతో కలిసి నిషేదిత “Ephedrine” డ్రగ్ ను విదేశాలకు ఎగుమతి చేసి డబ్బు సంపాదించారని.. అందుకోసం కొంతమంది ఆధార్ కార్డులు సేకరించి మార్ఫింగ్ చేశారని.. డ్రగ్స్ ను విదేశాలకు పంపేందుకు విజయవాడ భారతి నగర్ లోని డీఎస్‌టీ కొరియర్ ఆఫీసులోని తేజ అను ఉద్యోగికి డబ్బు ఆశ చూపించారి.. హైదరాబాద్‌లోని డీఎస్‌టీ హెడ్ ఆఫీసులో పని చేస్తున్న మేనేజర్ ఎర్రం శ్యామ్ సుందర్, కీర్తిపాటి ప్రవీణ్ వర్మ, తుమ్మల శ్రీనివాస్‌లు డ్రగ్స్ ఎగుమతి చేయటానికి లాలూచి పడ్డారని.. వీళ్ల సహకారంతోనే డ్రగ్ ఆస్ట్రేలియాకు ఎగుమతి జరిగిందని విచారణలో తేల్చారు పోలీసులు.. ఇక, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతుంది.. డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా మార్చి 30న గుత్తలతేజను బెంగళూరు ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.. అనంతరం విజయవాడ పటమట పీఎస్ లో గోపిసాయి ఫిర్యాదు మేరకు ఆధార్ కార్డు మార్ఫింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు… డ్రగ్ ఎగుమతి చేసిన కుప్పుసామి అరుణాచలం వెంకటేశన్ ను మే5న అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.. మే14న కస్టడీకి తీసుకుని విచారించిన సందర్భంలో డీఎస్‌టీ కొరియర్ సంస్థ ఉద్యోగుల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.. అనంతరం మూడు పోలీసు బృందాల ద్వారా నిందితుల గాలింపు చర్యలు చేపట్టారు.. మే 16న డీఎస్‌టీ కొరియర్ హెడ్ ఆఫీసు ఉద్యోగులైన ఎర్రం శ్యామ్ సుందర్, కీర్తిపాటి ప్రవీణ్ వర్మ, తుమ్మల శ్రీనివాస్‌లను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు.. అయితే, మరోసారి డ్రగ్స్ దొరకడం విజయవాడలో కలకలం సృష్టిస్తోంది.
తాజావార్తలు
-
AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
-
Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్‌కు క్యాబినెట్ ఆమోదం?
-
Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!