Mahesh Babu: సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అస్థికలను కుమారుడు మహేష్ బాబు బెజవాడలోని కృష్ణా నదిలో నిమజ్జనం చేయనున్నారు.
Swimming: ప్రస్తుత కాలంలో ఆధునిక పోకడల కారణంగా 30 ఏళ్లు వచ్చేసరికి కొందరు అనారోగ్యం పాలవుతున్నారు. 50 ఏళ్లు వచ్చేసరికే సొంత పనులు చేసుకోవడానికే ఆపసోపాలు పడుతున్నారు. కానీ 82 ఏళ్ల బామ్మ మాత్రం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలలో అదరగొడుతోంది. ఈ వయసులోనూ మూడు బంగారు పతకాలు సాధించి అందరి నోళ్లు మూయించింది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ గాంధీనగర్‌లో మంగళవారం నాడు రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలను నిర్వహించారు. 50 మీటర్ల…
Tribute To Krishna: సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో టాలీవుడ్ మరోసారి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మహేష్‌బాబు ఫ్యామిలీలో ఈ ఏడాది వరుసగా ఇది మూడో విషాదం కావడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. జనవరిలో సోదరుడు రమేష్‌బాబు మరణం, ఆగస్టులో తల్లి ఇందిరాదేవి మరణం, నవంబరులో తండ్రి మరణం మహేష్‌బాబును మానసికంగా కుంగదీశాయి. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు కృష్ణ మృతి పట్ల తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు. కృష్ణ మృతికి సంతాపంగా…
సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 65వ జాతీయ రహదారిపై రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.
Telugu Desam Party: ఎన్టీఆర్ జిల్లా బెజవాడ టీడీపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం నాడు కేశినేని నాని, దేవినేని ఉమ వ్యతిరేక శిబిరాల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న తన ఫార్మ్ హౌసులో టీడీపీ నేతల విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ సెగ్మెంట్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అటు మైలవరం టీడీపీలో గందరగోళం నెలకొంది. దేవినేని ఉమ, తన ఫొటో…
Vijayawada: సాధారణంగా ఎవరైనా మోసం చేస్తే పోలీసులను ఆశ్రయిస్తారు. కానీ పోలీసులే మోసం చేస్తే ఎవరికి చెప్పాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? తాజాగా విజయవాడలో పోలీసులే నిరుద్యోగులకు టోకరా పెట్టారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సుబ్బారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సురేష్ హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షలు వసూలు చేశారు. అయితే ఇదంతా 2020లో చోటు చేసుకుంది. వన్‌టౌన్ పోలీస్ క్వార్టర్స్ వద్ద…
Andhra Pradesh: విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ విమాన సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా విజయవాడ-షార్జా మధ్య రాకపోకలు కూడా ప్రారంభం కావడంతో షార్జా నుంచి విమానం గన్నవరం చేరుకుంది. షార్జా వెళ్లే విమాన సర్వీసును గన్నవరం విమానాశ్రయం నుంచి వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి… టీడీపీ ఎంపీ కేశినేని నానితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు ఎంపీలు షార్జా విమానం ఎక్కిన ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు…
విజయవాడలో ఏడాది క్రితం జరిగిన బిల్డర్ హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది... విజయవాడ శివార్లలోని 61వ డివిజన్ పాయకాపురం దేవినేని గాంధీపురంలో హత్యకు గురైన బిల్డర్ పీతల అప్పలరాజు హత్య మిస్టరీని పోలీసులు చేధించారు.
టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న నిరాహార దీక్షను భగ్నం చేశారు పోలీసులు.. ఉత్తరాంధ్ర ప్రజా సమస్యలపై పోరాటం కోసమంటూ బుద్దా వెంకన్న బయలుదేరగా.. పోలీసులను ఆయన్ని అడ్డుకున్న విషయం తెలిసిందే.. దానికి నిరసనగా నిరాహార దీక్ష చేపట్టారు వెంకన్న.. ఉత్తరాంధ్రలో టీడీపీ నాయకులు పోరాడితే వైసీపీ నేతల దోపిడి బయటపడుతుంది అనే భయంతో.. ఇలా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.. అయితే, తన నివాసంలోనే నిరాహార దీక్షకు దిగిన బుద్దా వెంకన్నను అర్ధరాత్రి ఆస్పత్రికి తరలించారు పోలీసులు..…