South Central Railway: దేశంలో అనేక ప్రాంతాల్లో నడుస్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు త్వరలో తెలుగు రాష్ట్రాల్లో కూడా పట్టాలెక్కనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు అధికారిక సమాచారం అందింది. ఇప్పటికే విశాఖ కేంద్రంగా వందేభారత్ రైలును కేటాయిస్తూ స్వయంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటన చేశారు. ఈ మేరకు సికింద్రాబాద్-విజయవాడ మార్గంలో వయా కాజీపేట మీదుగా ఈ నెలలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రైలును ప్రారంభించేందుకు దక్షిణమధ్య రైల్వే సన్నాహాలు…
భారత రాష్ట్రపతి హోదాలో తొలిసారి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టబోతున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఆమె పర్యటన కొనసాగనుంది.. తొలి పర్యటనలో రేపు ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగనుంది.. రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరనున్న రాష్ట్రపతి.. ఉదయం 10.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.. విమానాశ్రయంలో స్వాగతం పలకున్నారు గవర్నర్, సీఎం వైఎస్ జగన్.. గన్నవరం విమానాశ్రయం నుండి నేరుగా పోరంకి మురళి రిసార్టుకు చేరుకుంటారు…
ED Raids: గుంటూరులోని ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు ముగిశాయి.. 27 గంటలపాటు సోదాలు, విచారణ సాగింది.. ఈడీ రైడ్స్లో పెద్ద ఎత్తున డాక్యుమెంట్ల స్వాధీనం చేసుకున్నారు.. మూడు బ్యాగుల్లో డాక్యుమెంట్లను తీసుకెళ్లారు అధికాలరు.. ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో జరిపిన సోదాల్లో కీలక ఆధారాలను రాబట్టింది ఈడీ.. నిబంధనలకు విరుద్దంగా జరిగిన ఆర్ధిక లావాదేవీల వివరాలను డాక్యుమెంట్లతో సహా స్వాధీనం చేసుకున్నారు.. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ నుంచి సుమారు రూ. 25 కోట్ల మేర నిధులు పక్కదారి…
బెజవాడలో గంజాయి, బ్లెడ్ బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది.. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఘటన ఇప్పుడు కలకలం సృష్టించింది. స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్న ఏడో తరగతి విద్యార్థిని అడ్డగించిన బ్లేడ్ బ్యాచ్… బ్లేడు చూపిస్తూ.. విద్యార్థిని బెదిరించింది.. డబ్బులు కావాలని దాడికి దిగింది.. దాంతో భయంతో వణికిపోయిన ఆ విద్యార్థి వారి నుండి ఎలాగోలా తప్పించుకుని ఇంటికి పరుగులు పెట్టాడు.. జరిగిన విషయాన్ని తల్లితండ్రులకు చెప్పటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో పక్క…
ఆంధ్రప్రదేశ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదులు కలకలం రేపుతున్నాయి.. విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్పై ఈడీ రైడ్స్ కొనసాగుతున్నాయి.. ఆస్పత్రిలోపలికి ఎవరూ వెళ్లకుండా సెక్యూరిటీగా సీఆర్పీఎఫ్ సిబ్బందిని ఉంచారు.. ఆస్పత్రి ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు.. ఆస్పత్రి ఛైర్మన్ తో సహా సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.. ఈ దాడుల్లో మొత్తం 8 మంది ఈడీ అధికారులు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది.. అమెరికాలో వైద్యురాలుగా ఉంటూ 21-08-2022 విజయవాడలో అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిని ప్రారంభించారు అక్కినేని మణి.. ఇక, ఈ ఆస్పత్రి…
Andhra Pradesh: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఏపీలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. గతంలో రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం ఏపీ వచ్చిన ఆమె.. ఈసారి రాష్ట్రపతి హోదాలో రాష్ట్రంలో అడుగుపెట్టనున్నారు. ఈనెల 4న ఢిల్లీ నుంచి ఆమె విజయవాడ చేరుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వివరాలను గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా వెల్లడించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఢిల్లీలో ప్రత్యేక…
బీసీలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. డిసెంబర్ 8వ తేదీన చేపట్టాలనుకున్న బీసీల ఆత్మీయ సదస్సు ఒక రోజు ముందే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.. డిసెంబర్ 7వ తేదీన భారీ ఎత్తున బీసీ సదస్సు ఉంటుంది.. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో సమావేశం జరగనుండగా.. 60 వేల నుంచి 75 వేల వరకు బీసీ నేతలు హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు.. గ్రామ పంచాయతీ సభ్యుల నుంచి మంత్రుల వరకు హాజరుకానున్న ప్రజా ప్రతినిధులు.. నామినేటెడ్…
బీసీలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్.. ఇవాళ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం వేదికగా.. బీసీ మంత్రులు, నేతలు కీలక సమావేశం అయ్యారు.. ఈ సందర్భంగా మీడియతో మాట్లాడిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్.. విజయవాడలో డిసెంబర్ 8న భారీ ఎత్తున బీసీ సదస్సు నిర్వహిస్తామని తెలిపారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం హాజరయ్యే అవకాశం ఉందన్నారు.. ఇక, బీసీల గురించి ఎన్నికల ముందు నుంచే ఆలోచించిన వ్యక్తి వైఎస్ జగన్…