బెజవాడలో గంజాయి, బ్లెడ్ బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది.. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఘటన ఇప్పుడు కలకలం సృష్టించింది. స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్న ఏడో తరగతి విద్యార్థిని అడ్డగించిన బ్లేడ్ బ్యాచ్… బ్లేడు చూపిస్తూ.. విద్యార్థిని బెదిరించింది.. డబ్బులు కావాలని దాడికి దిగింది.. దాంతో భయంతో వణికిపోయిన ఆ విద్యార్థి వారి నుండి ఎలాగోలా తప్పించుకుని ఇంటికి పరుగులు పెట్టాడు.. జరిగిన విషయాన్ని తల్లితండ్రులకు చెప్పటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో పక్క గత కొంత కాలంగా ఈ స్కూల్ విద్యార్థులని ఈ బ్యాచ్ ట్రాప్ చేసి చెడు అలవాట్లు నేర్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి..
Read Also: YS Sharmila: కొట్టినా, చంపినా బెదిరేదిలేదు.. పాదయాత్ర కొనసాగింపుపై షర్మిల కీలక నిర్ణయం
అయితే, బ్లేడ్ బ్యాచ్ వ్యవహారం కలకలం సృష్టించడంతో.. అప్రమత్తమైన పోలీసులు.. గంజాయి బ్యాచ్ ఆగడాలతో స్కూల్ వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.. విద్యార్థులతో పరిచయాలు పెంచుకుని చెడు అలవాట్లకు పురుగొల్తుతోన్న బ్యాచ్‌పై ఫోకస్ పెట్టారు.. గంజాయి బ్యాచ్ పరిచయాలతో పక్కదారి పడుతున్న విద్యార్థులల్లో అవగాహన పెంచేందుకు పూనుకుంటున్నారు.. అయితే, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి స్కూల్ యాజమాన్యంపై కూడా ఒత్తిడి పెరగడంతో.. పోలీసులకు స్కూల్ నుంచి కూడా ఫిర్యాదు చేసిన స్కూల్ యాజమాన్యం….